Begin typing your search above and press return to search.
వావ్.. ఈసీ ఇంత వేగంగా రియాక్టు అవుతుందా?
By: Tupaki Desk | 2 May 2021 11:30 AM GMTసామాన్యుడు మొదలు దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. ఈ ఎన్నికల సందర్భంగా బోలెడన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. మస్తు వీడియోలు వైరల్ అయ్యాయి. పోలింగ్ వేళ.. బీజేపీ కార్యకర్తల ఆరాచకం చాలా ఎక్కువగా ఫోకస్ అయ్యింది. అయినప్పటికీ అప్పటికప్పుడు స్పందించాల్సిన వ్యవస్థలు చేష్టలుడిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
అయినప్పటికి పెద్దగా స్పందించలేదన్న విమర్శ తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానాల్ని అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటివేళ.. వెలువడిన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విజయం ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా వెలువడిన ఫలితాల నేపథ్యంలో తమిళనాడులో విపక్ష డీఎంకే విజయం సాధించటం.. పోటాపోటీగా సాగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార దీదీ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. దీంతో.. రెండు రాష్ట్రాల్లో త్వరలోనే బెంగాల్ సీఎంగా దీదీ.. తమిళనాడులో స్టాలిన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ఆనందోత్సవాల కారణంగా వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువ అవుతుందన్నఆందోళనలు ఉన్నాయి. నిజానికి ఎన్నికల ప్రచారం జోరుగా సాగే వేళ నుంచి ఈ వాదన ఉన్నా.. ఎవరూ పట్టించుకున్నది లేదు.
తాజాగా మాత్రంకేంద్ర ఎన్నికల సంఘం యుద్ధ ప్రాతిపదికన స్పందించటమేకాదు.. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆయా రాష్ట్రాల సీఎస్ లకు ఆదేశాల్నిజారీ చేసింది. రెండు రాష్ట్రాల్లో గెలుపొందిన పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి సంబురాలు చేసుకోవటాన్ని తీవ్రంగా పరిగణించటమే కాదు.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రక్రియలో ఇంత వేగంగా స్పందించని ఈసీ.. చివరి రోజున.. అది కూడా ఫలితాలు వెల్లడైన తర్వాత స్పందించటంలో అర్థమేమిటి? ఇదే హుషారును ఎన్నికల వేళలో ప్రదర్శించి ఉంటే బాగుండేది కదా?