Begin typing your search above and press return to search.
రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్..ఎలా దొరికాడంటే?
By: Tupaki Desk | 23 May 2021 1:30 PM GMTఓ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. యువ రెజ్లర్ సాగర్ రాణా ఇటీవల హత్యకు గురయ్యాడు. ఈ హత్యతో రెజ్లర్ సుశీల్ కు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. వారిద్దరి మధ్య గొడవలు చెలరేగడంతో సుశీల్ కొంతమందితో కలిసి రాణాను హత్యచేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. అంతేకాక ఈ కేసులో పోలీసులు ప్రాథమిక విచారణ చేసి కొన్ని ఆధారాలు కూడా సేకరించారు.అయితే అప్పటి నుంచి సుశీల్ కుమార్ పరారీలో ఉన్నారు. దీంతో పోలీసులు సుశీల్ కోసం వెతుకుతున్నారు. అతడిని పట్టించిన వారికి రూ. లక్ష రివార్డు కూడా ప్రకటించారు.
మరోవైపు సుశీల్ దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు అతడిపై లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇదిలా ఉంటే ఎట్టకేలకు సుశీల్ అతడి అనుచరులను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ జలంధర్లో సుశీల్ పట్టుబడ్డట్టు పోలీసులు తెలిపారు. 15 రోజులుగా సుశీల్ పరారీలో ఉన్నాడు.
ఇంతకూ సుశీల్ పై నమోదైన కేసు ఏమిటంటే..
ఛత్రసాల్ స్టేడియంలో యువ రెజ్లర్ సాగర్ రాణా (23) హత్యకు గురయ్యాడు. ఈ హత్యతో సుశీల్ (37), అతడి అనుచరుడు అజయ్ కుమార్ ప్రమేయం ఉన్నట్టు ఫిర్యాదులు అందాయి. దీంతో సుశీల్ పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తప్పించుకొని తిరుగుతున్న అతడిపై లుక్ అవుట్ నోటీసు కూడా జారీ అయింది.
అయితే ఈ కేసులో సుశీల్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు తిరస్కరించింది. ఢిల్లీకి చెందిన సుశీల్ కుమార్ 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో కాంస్య పతకంతో పాటు 2012 లండన్ విశ్వక్రీడల్లో రజత పతకం సాధించాడు. అయితే ఓ క్రీడాకారుడు హత్యకేసులో ఇరుక్కోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పైగా సుశీల్ పారిపోవడంతో ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఎట్టకేలకు సుశీల్ పోలీసులకు చిక్కాడు.