Begin typing your search above and press return to search.
పంత్‌ను ధోనీతో పోల్చడం ఏమిటి? వికెట్ కీపర్ సాహా వ్యాఖ్యలు
By: Tupaki Desk | 24 Jan 2021 12:30 AM GMTఇటీవల ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో రిషబ్ పంత్ రాణించిన విషయం తెలిసిందే. నాలుగో టెస్ట్ లో ప్రధాన వికెట్స్ కోల్పోయి మ్యాచ్ డ్రా అయితే చాలురా దేవుడా.. అనే పరిస్థితుల్లో బ్యాటింగ్ కి వచ్చిన పంత్ చెలరేగి ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు.పంత్‌కు ఇక టీం ఇండియాలో స్థానం పదిలమైనట్టేనని కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వికెట్ కీపర్‌గా ఉన్న వృద్ధిమాన్ సాహా పరిస్థితి ఏమిటి? అన్న విషయంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వృద్ధిమాన్ సాహా స్పందించాడు.
‘నాకు పంత్‌కు ఎటువంటి విబేధాలు లేవు. పంత్‌తో నేను ఎంతో స్నేహంగా ఉంటాను. అతడు బాగా ఆడినంత మాత్రాన నా కెరీర్‌కు ఢోకా ఏమీ ఉండదు. పంత్‌కు నాకు మధ్య అనుబంధం ఎలా ఉంటుందో.. మీరు అతడినే అడిగి తెలుసుకోవచ్చు.ఎవరికి అవకాశం వచ్చినా మేము సహకరించుకుంటాం. నాకు గాయం కావడం వల్లే పంత్‌కు అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి.
ప్రస్తుతం పంత్ బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన ఇస్తున్నాడు. కీపింగ్‌లో కూడా అతడు రాణిస్తాడేమో వేచి చూడాలి’ అని సాహా పేర్కొన్నాడు.
‘అయితే చాలా మంది ఈ ఒక్క మ్యాచ్‌తోనే పంత్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కొంతమంది పంత్‌ను ధోనీతో పోలుస్తున్నారు. ఇలా ఎందుకు పొగుడుతున్నారో అర్థం కావడం లేదు.
రహానే కెప్టెన్సీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడు చాలా కూల్‌గా ఉంటాడు. జట్టులోని క్రీడాకారులందరికీ సమాన గౌరవం ఇస్తాడు. అందరినీ నమ్ముతాడు’ అని సాహా పేర్కొన్నాడు.