Begin typing your search above and press return to search.

యాంటీగా రాస్తున్నారా? జ‌నాలు చ‌ద‌వితేక‌దా!! వైసీపీ టాక్‌!!

By:  Tupaki Desk   |   15 Oct 2022 12:30 AM GMT
యాంటీగా రాస్తున్నారా?  జ‌నాలు చ‌ద‌వితేక‌దా!! వైసీపీ టాక్‌!!
X
సాధార‌ణంగా.. ప‌ద్ధ‌తైన ఏ వ్య‌క్తి అయినా.. త‌న‌పై చిన్న మ‌ర‌క కూడా ప‌డ‌కూడ‌ద‌ని.. త‌ను తెల్ల కాయితం మాదిరిగా.. స‌మాజంలో త‌లెత్తుకుని.. జీవించాల‌ని కోరుకుంటారు. ఇక‌, ప్ర‌భుత్వం అయితే.. మ‌రింత జా గ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరుకుంటుంది. అంతేకాదు.. ప్ర‌భుత్వ విధానాల‌పై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌ను స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం కూడా చేస్తుంది. ఏదైనా విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో తేడా వ‌స్తే.. సీనియ‌ర్ అధికారుల‌తో చ‌ర్చించి.. మార్చుకుంటుంది.

అయితే.. ఏపీలో ఉన్న వైసీపీ ప్ర‌భుత్వం మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌నే టాక్ వినిపి స్తోంది. ఇటు.. న్యాయ వ్య‌వ‌స్థ నుంచి.. అటు ప్ర‌జ‌ల నుంచి కూడా వ్య‌క్త‌మ‌వుతున్న అభిప్రాయాల‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండానే ముందుకు సాగుతున్న ప‌రిస్థితిని.. ప‌త్రిక‌లు బ్యాన‌ర్ ఐటంలుగా ఇస్తున్నా యి.

వాస్త‌వానికి ఇలాంటివి వ‌చ్చిన‌ప్పుడు.. గ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇచ్చింది. దీనికి సంబంధించి.. సూరీడు అని ఒక అధికారిని నియ‌మించి.. ప్ర‌భుత్వంపై వ‌చ్చే వార్త‌ల‌ను ప్ర‌త్యేక క‌టింగులు పెట్టుకునేది.

ప్ర‌జ‌ల్లో ఎక్క‌డ వ్య‌తిరేక‌త వ‌స్తుందో అని.. త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డేది. దానికి అనుగుణంగా అవ‌స‌ర‌మైతే.. పాల‌సీ ల‌ను కూడా మార్చుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. ఇక‌, చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలోనూ.. ఇదే విధానం కొన‌సాగించారు. ప‌త్రిక‌ల‌ను ప్రామాణికంగా తీసుకునేవారు. వాటిలో వ‌చ్చే అనుకూల‌.. ప్ర‌తికూల వార్త‌ల‌ను.. ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని.. వాటిపై చ‌ర్చ‌లు చేసేవారు.. అనుకూలంగా లేక‌పోతే.. మార్పులు చేసుకునేవారు. అంతెందుకు.. పొరుగున ఉన్న తెలంగాణ స‌ర్కారు కూడా.. వ్య‌తిరేక వార్త‌ల‌పై అంతో ఇంతో స్పందిస్తోంది.

ద‌ళిత బంధు విష‌యంలో .. సొంత పార్టీ ఎమ్మెల్యే సోద‌రుడికి.. నిధులు అందాయ‌ని తెలిసి.. అంత‌ర్గ‌తం గా అయినా.. చ‌ర్య‌లు తీసుకున్న ప రిస్థితి ఉంది. ఇక‌, ఇత‌ర విష‌యాల్లోనూ.. అంతో ఇంతో స్పందిస్తోంది. కానీ, ఎటొచ్చీ.. వైసీపీ స‌ర్కారు ప‌త్రిక‌ల‌ను ప‌ట్టించుకోక‌పోగా.. 'అస‌లు ప్ర‌జ‌లు చ‌దువుతున్నారా?'' అని ఎదురు ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం రాజ‌ధాని విష‌యం కావొచ్చు.. న్యాయ‌స్థానాల అంశాలు కావొచ్చు.. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక తీర్పులు వ‌చ్చిన సంద‌ర్భాల్లోనూ.. వాటిని స‌రిదిద్దుకోవ‌డం మానేసి.. ఎదురు దాడి చేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మ‌రి.. ఈ స‌ర్కారుకు మార్కులు ఎలా ప‌డ‌తాయో.. చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.