Begin typing your search above and press return to search.
గుజరాత్ లో ఎక్స్ ఈ కలకలం.. ఐదు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు!
By: Tupaki Desk | 9 April 2022 11:30 AM GMTదేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తున్న సమయంలో మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చి అన్ని దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే చైనా, అమెరికా వంటి దేశాలను ఆగం చేసిన ఈ మహమ్మారి ఇప్పుడు భారత్ లోనూ కలకలం సృష్టిస్తోంది. ఇటీవలే ముంబయిలో ఈ రకం కేసు బయటపడినట్లు వార్తలు రాగా... తాజాగా గుజరాత్ లోనూ తొలి ఒమిక్రాన్ ఎక్స్ఈ కేసు నమోదు అయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే అది కచ్చితంగా ఎక్స్ఈ వేరియంటేనా కాదా అన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు.
ఎక్స్ ఈ వేరియంట్ సోకినట్లుగా భావిస్తున్న వ్యక్తి నమూనాలు నేషనల్ సెంటర్ పర్ డిసీజ్ కంట్రోల్ కు పంపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది కూడా చెప్పలేదు. దరు వ్యక్తి మార్చి 13న కొవిడ్ బారిన పడగా.. వారం రోజులకు కోలుకున్నట్లు తెలుస్తోంది. అయితే జీనోమ్ సీక్వెన్సింగ్ లో ఎక్స్ ఈ వేరియంట్ సోకినట్లు అనుమానాలు వ్యక్తం అవడంతో తదుపరి విశ్లేషణ నిమిత్తం ఎన్సీడీసీకి పంపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
కరోనా వైరస్ కొత్త వేరియంట్ బ్రిటన్ లో తొలి కేసు నమోదు అయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 600 కేసులు నమోదు అయ్యయాయని డ్యబ్లూహెచ్ఓ పేర్కొంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ఆరోగ్య శాఖ ఐదు రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ప్రకారం ఢిల్లీ, హరియాణా, కేరళ, మహారాష్ట్ర, మిజోరం ప్రభుత్వాలకు లేఖలు రాసింది.
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని ఐదు రాష్ట్రాలకు రాసిన లేఖల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం సంక్రమణ రేటు పెరుగుదలకు గల కారణాలను తీవ్రంగా పరిశోధనలు జరగాలని తెలిపింది. ఇదిలా ఉండగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం... గత 24 గంటల్లో కేరళలో 353, మహారాష్ట్రలో 113, హరియాణాలో 336, మిజోరంలో 123 కేసులు నమోదు అయ్యాయి. అందుకే అన్ని రాష్ట్రాలు ముందస్తు చర్యల కోసం సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఒమిక్రాన్‌లోని రెండు సబ్ వెర్షన్లు అయిన బీఏ.1, బీఏ.2 కలిసి ఎక్స్‌ఈ వేరియంట్‌గా రూపాంతరం చెందాయి. ఈ ఎక్స్ఈ వేరియంట్ తొలి సారిగా యూకేలో బయట పడింది. అయితే ఆ తర్వాత పలు దేశాలకు వ్యాపించింది.
దీని వ్యాప్తి వేగం ఒమిక్రాన్ కంటే 10 రెట్లు ఎక్కువ కావడంతో కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రాణాంతకమైన తీవ్ర లక్షణాలు ఉండకపోవచ్చని సమాచారం.