Begin typing your search above and press return to search.
ఫ్రెండ్ కి దిమ్మ తిరిగిపోయే షాకిచ్చిన డ్రాగన్
By: Tupaki Desk | 11 Jun 2017 6:06 AM GMTతానా అంటే తందానా అంటూ చైనా అడుగులకు మడుగులు ఒత్తే పాకిస్థాన్ కు తాజాగా ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భారత్ మీద ఉన్న అసూయతో.. దాయాది వైరంతో నిత్యం రగిలిపోయే పాడు పాక్.. చైనాతో అంటకాగుతున్న వైనం తెలిసిందే. ఆసియాలో తన తీరుతో భారత్ ఎక్కడ పెద్దన్న హోదాను సొంతం చేసుకుంటుందో అన్న భయం చైనాకు ఎప్పటి నుంచో ఉన్నదే.
తన పాడు ఆలోచనలతో.. పాకిస్థాన్ లాంటి దేశాల్ని చేరదీసి.. వారికి మద్దతుగా నిలుస్తూ.. భారత్ ను కంట్రోల్ చేసేందుకు కిందామీదా పడుతూ ఉంటుంది చైనా. తమకు ఎదురైన ఇబ్బందితో ఒక్కసారి కస్సుమన్న చైనా.. మిత్రుడు పాక్ కు కరెంటు షాక్ కొట్టేలా నిర్ణయం తీసుకుంది. బలోచిస్థాన్ లో ఇద్దరు చైనీయులను దారుణంగా హత్య చేసిన వైనంపై డ్రాగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇద్దరు చైనీయుల ప్రాణాలు పోవటానికి కారణమైన ఉదంతంపై పాకిస్థాన్ ప్రధానికే నేరుగా షాకిచ్చింది. ఆస్థానాలో షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు జరిగింది. దీనికి భారత్.. పాక్ లతో సహా కజకిస్థాన్.. ఉజ్బెకిస్థాన్.. ఆఫ్ఘనిస్థాన్.. రష్యా దేశాధినేతలు హాజరయ్యారు. వాస్తవానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సమావేశం కావాల్సి ఉంది. అయితే.. బలూచిస్థాన్ లో ఇద్దరు చైనీయుల్ని దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో.. తమ నిరసనను వ్యక్తం చేస్తూ పాక్ ప్రధానితో భేటీకి ససేమిరా అన్నారు చైనా అధ్యక్షులు. ఈ నిర్ణయంతో పాక్ కు భారీ షాక్ తగిలినట్లైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/