Begin typing your search above and press return to search.
విశాఖకు షామి భారీ వరం?
By: Tupaki Desk | 11 Aug 2015 10:02 AM GMTచైనాకు చెందిన షామి కంపెనీ ఉపాధ్యక్షుడు హ్యూగో బర్రాకు విశాఖ పట్నం బాగా నచ్చేసిందా? అతి త్వరలోనే విశాఖలో భారీ ప్రాజెక్టును ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారా? విశాఖ నుంచి వెళుతూ వెళుతూ ఫేస్ బుక్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనమా? సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది.
చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో తయారైన తొలి దేశీయ స్మార్ట్ ఫోన్ రెడ్ మి 2 ప్రైమ్ ను విడుదల చేయడానికి సోమవారం ఆయన విశాఖ వచ్చారు. అక్కడ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత విశాఖ నుంచి వెళ్లిపోతూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. గుడ్ మార్నింగ్ విశాఖపట్నం అని అన్నారు. అంతేనా.. ఇప్పుడు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లిపోతున్నాం.. ఈ వారాంతంలోనే అరైవల్ టెర్మినల్ కు వస్తాం. భారతదేశంలో మేం ఒక భారీ ముందడుగు వేయబోతున్నాం. అదేమిటో ఊహించండి చూద్దాం’ అంటూ ఆయన పోస్ట్ చేశారు. దాంతో షామి కంపెనీ అతి త్వరలోనే విశాఖపట్నంలో అతి పెద్ద మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ను పెట్టబోతోందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
ప్రధాని మోదీ మేకిన్ ఇండియా నినాదం, సీఎం చంద్రబాబు మేకిన్ ఏపీ నినాదాలతోపాటు ఇక్కడి పారిశ్రామిక విధానం, రాయితీలు కూడా నచ్చిన ఆయన పెట్టినా పెట్టవచ్చునని అంటున్నారు. పెడితే మంచిదే కదా...