Begin typing your search above and press return to search.

ట్రాన్స్ జెండర్ల ఆట.. ఎగబడి చూస్తున్నారు..

By:  Tupaki Desk   |   18 Jun 2020 12:30 AM GMT
ట్రాన్స్ జెండర్ల ఆట.. ఎగబడి చూస్తున్నారు..
X
మగవారు ఆడితే కొంచెం ఫాస్ట్ గా.. ఆడవారి ఆటలు కొంచెం తీవ్రత తక్కువగా ఉంటాయి. మరి ట్రాన్స్ జెండర్లు ఆడితే ఎలా ఉంటుంది? అవి చూడాలనుకుంటున్నారా? అయితే రెడీ కండి. మణిపూర్ వాసులు ‘యేవేశాంగ్’ పండుగను ఘనంగా జరుపుతారు.వసంతం రాకను పురస్కరించుకొని జరిపే ఈ పండుగను ‘మణిపూర్ హోలీ’ అంటారు. ఐదురోజుల పాటు ఈ వేడుకను అన్ని వర్గాలు, కులాలు, ఆడ మగ తేడా లేకుండా ఉత్సాహంగా చేస్తారు.

ఈ క్రమంలోనే వివిధ రకాల క్రీడలు, ఆటల పోటీలు నిర్వహిస్తారు. ముగింపు సందర్భంగా సంగీత విభావరీలు కూడా ఉంటాయి. ఈ సారి ఈ క్రీడల్లో ట్రాన్స్ జెండర్స్ కూడా పాల్గొనడంతో మరింత ఆకర్షణగా మారింది. ఫుట్ బాల్ పోటీల్లో ఈ ట్రాన్స్ జెండర్లు పాల్గొనబోతున్నారు.

‘యా ఆల్ ’ అనే ఎన్జీవో సంస్థ తాజాగా 14మంది ట్రాన్స్ జెండర్లతో ఫుట్ బాల్ టీం తయారు చేసి పోటీల్లో నిలిపింది. వారు రెండు జట్లుగా విడిపోయి పోటీపడుతున్నారు. ట్రాన్స్ జెండర్లతో ఇప్పటికే 2018, 2019 సంవత్సరాల్లో వరుసగా ఫుట్ బాల్ టోర్నమెంట్లు నిర్వహించారు. ప్రజల నుంచి భారీ ఆదరణ లభించింది.

పురుషులుగా మారిన వారిని ఒక జట్టుగా.. స్త్రీలుగా మారిన వారిని ఓ జట్టుగా చేసి సదురు స్వచ్ఛంద సంస్థ రెండు జట్లను రూపొందించి ఫుట్ బాల్ పోటీలు నిర్వహిస్తే మణిపూర్ ప్రజలు ఎగబడి చూశారు. వీరినే తాజాగా పురుషులు,స్త్రీలతో నిర్వహిస్తే మంచి ఆదరణ ఉంటుందని భావిస్తున్నారు. జాతీయ స్థాయి క్రీడల్లో కూడా ఈ ట్రాన్స్ జెండర్లకు కూడా సముచిత స్థానం లభిస్తుందని ఆశిస్తున్నారు.