Begin typing your search above and press return to search.
నిఖిల్ గౌడ పెళ్లిపై స్పందించమంటే...కంగ్రాట్స్ చెప్పిన సీఎం
By: Tupaki Desk | 18 April 2020 4:30 PM GMTలాక్ డౌన్... మొత్తం ఇండియాలో 130 కోట్ల మందికి వర్తిస్తుందని, ఎక్కడున్న వారు అక్కడే ఉండండి... ప్రధాని నరేంద్ర మోడీ చాలా గట్టిగా చెప్పారు. కానీ పెళ్లికి అంత తొందరేమొచ్చిందో గానీ... కుమారస్వామి కొడుకు ఆగలేకపోయాడు. పరిమిత కుటుంబ సభ్యులతో పెళ్లి చేసుకున్నాడు. అదేమీ అమాయక కుటుంబం కాదు. ఆ ఇంట్లో ఒక మాజీ ప్రధాని ఉన్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఒక ఎంపీ కూడా ఉన్నాడు. అయినా దేశ ప్రజలందరికీ ఒక న్యాయం, వారికి ఒక న్యాయం అన్నట్టు ప్రవర్తించారు. విచిత్రం ఏంటంటే... ఈ పెళ్లికి హాజరైన వారిలో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా ఉన్నారు. దీంతో ఆయనా చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే దీనిపై ఒకసారి మాట్లాడిన యడ్యూరప్ప విచారణకు ఆదేశించారు.
కానీ అతిథుల్లో ఒకడు కావడంతో ప్రజల నుంచి విపరీతంగా దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తుండటంతో మరోసారి దీనిపై యడ్యూరప్ప స్పందించాల్సి వచ్చింది. అయితే తనంతట తానేం స్పందించేదు. శనివారం ఓ మీడియా ఛానెల్లో చర్చ సందర్భంగా... ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. "పెళ్లి జరపటానికి కావాల్సిన అన్ని అనుమతులు వారు తీసుకున్నారు. పెళ్లిని కూడా చాలా సింపుల్‌గా జరిపించారు. దాని గురించి చర్చలు అనవసరం. వారి పరిధిలో వారు చాలా చక్కగా చేశారు, దానికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను" అన్నారు. అతిథుల్లో ఒక్కడిగా ఉండటంతో దీనిని ఎలాగైనా ప్రజల దృష్టి నుంచి మరలించాల్సిన తలనొప్పి సీఎంపై పడింది.
వాస్తవానికి ఈ పర్మిషన్ అన్నది అబద్ధం. అసలు దేశ ప్రజలందరికీ సంబంధించి శ్రీరామ నవమి వేడుకలకే వంద మందికి కూడా అనుమతి ఇవ్వలేదు. ఆయా రాష్ట్రాల్లో ఆయా మంత్రులు వారి పర్సనల్ సిబ్బంది మాత్రమే పదుల సంఖ్యలో మాత్రమే హాజరై వేడుక జరిపించారు. అలాంటిది అనుమతి ఇవ్వడం అనే ప్రశ్నే లేదు. అది కేవలం స్వంత విచక్షణతో ఇచ్చిన అనుమతి. వార్త బయటకు రానంత వరకే ఈ అనుమతి పనిచేస్తుంది. అందుకే ప్రజలు ఈ వ్యవహారంపై రగిలిపోతున్నారు. మెడికల్ ఎమర్జెన్సీకి కూడా ఒక్కరిద్దరికి మించి అనుమతి లేదు పేషెంటుతో పాటు అనుమతి ఇవ్వడం లేదు. ఎవరయినా మరణించినా 10 మందికి మించి అనుమతించడం లేదు. వాయిదా వేయదగ్గ ఏ కార్యక్రమానికి ఏ ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి లేదు. అయినా రహస్యంగా జరుగుతుందనుకున్న తంతు ఇలా బయటపడేసరికి ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి దిక్కుతోచడం లేదు. అందుకే అది ముగిసిన వ్యవహారం. ఇక పై చర్చ అనవసరం అంటూ వెనకేసుకువచ్చారు యడ్యూరప్ప.