Begin typing your search above and press return to search.

సీఎం నిర్ణయం.. ప్రతీ సండే సంపూర్ణ లాక్ డౌన్

By:  Tupaki Desk   |   28 Jun 2020 4:30 AM GMT
సీఎం నిర్ణయం.. ప్రతీ సండే సంపూర్ణ లాక్ డౌన్
X
కర్ణాటక సహా మెట్రో నగరం బెంగళూరులో కరోనా పాజిటివ్ కేసులు జట్ స్పీడుగా దూసుకెళ్తున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ క్రమంలోనే కర్ణాటక సీఎం కఠిన నిర్ణయం తీసుకున్నారు.

జూలై 5 నుంచి ప్రతీ ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని కర్ణాటక సీఎం నిర్ణయించారు. ఈ మేరకు సీఎం యడియూరప్ప నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆదివారం రోజున సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగుతుందని.. అన్ని దుకాణాలు షాపింగ్ మాల్స్ ను మూసివేయాల్సిందిగా సీఎం యడియూరప్ప ఆదేశించారు. నిత్యావసరాల దుకాణాలు మాత్రమే తెరిచి ఉంచుతారన్నారు.ఇక రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిపారు. బెంగళూరులో కూరగాయల దుకాణాల సంఖ్యను పెంచాలని ఆదేశించారు.

కరోనా రోగులను ఆస్పత్రులకు చేర్చేందుకు.. చనిపోతే వారి ఊళ్లకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సేవలను సీఎం పెంచుతున్నట్టు తెలిపారు. కొత్తగా 10వేల పడకలను కోవిడ్ పేషంట్స్ కోసం బెంగళూరు నగరంలో సిద్ధం చేస్తామని కర్ణాటక వైద్యశాఖ మంత్రి తెలిపారు.

కోవిడ్ రోగుల కోసం ఫంక్షన్ హాల్స్, హాస్టల్స్, ఇతర ఇన్ స్టిట్యూషన్స్ ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. రైల్వే కోచ్ లను మెడికల్ వార్డుల్లా మారుస్తామన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల్లో 50శాతం పడకలను కరోనా రోగులకు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఇలా బెంగళూరును వణికిస్తున్న కరోనా కట్టడికి ఆ రాష్ట్ర సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.