Begin typing your search above and press return to search.

ఆ కంపెనీలో వారానికి 4 రోజులే వర్కింగ్ అట

By:  Tupaki Desk   |   17 Jan 2017 8:22 AM GMT
ఆ కంపెనీలో వారానికి 4 రోజులే వర్కింగ్ అట
X
పోటీ పెరిగిపోతోంది. ఒత్తిడి అంతకంతకు ఎక్కువవుతుంది. ముందుండాలన్న పరుగు పందెంలో ఉద్యోగి తీవ్రంగా అలిసిపోతున్నారు. కాసులవేట తప్పించి కంపెనీలు మరే విషయాన్ని పట్టించుకోని పరిస్థితి. ఎంతసేపు టార్గెట్లు.. డెడ్ లైన్ల కత్తి కొసను ఉద్యోగుల గొంతుల దగ్గర పెడుతున్న కంపెనీలధాటికి ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు.

రోజులు గడిచే కొద్దీ.. అంతకంతకూ మెరుగైన సామర్థ్యంతో పని చేయాలన్న ఒత్తిడి తీవ్రత పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితి మనదేశంతో సహా ప్రపంచంలోని చాలానే దేశాల్లో ఉంది. టెక్నాలజీ పరంగా ముందుండే జపాన్ లోనూ ఇలాంటి పరిస్థితి. సమయానికి విలువ ఇవ్వటం.. కష్టపడి పని చేయటం లాంటివి జపనీయుల తర్వాతే ఎవరైనా అన్న భావన కలుగుతుంది.

ఇళ్లకు వెళ్లకుండా ఓవర్ టైం అనుకోకుండా ఆఫీసుల్లో గంటల తరబడి పని చేయటం..కష్టపడి పని చేయటమే జీవితానికి లక్ష్యంగా చాలామంది జపనీయులు ఫీల్ అవుతుంటారట. ఇలా పని చేసే క్రమంలో కొందరు ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇలా తీవ్రమైన ఒత్తిడితో సూసైడ్ చేసుకోవాలనుకోవటం ఆ దేశంలోఎక్కువనే చెబుతున్నారు.

అందుకే ఉద్యోగులను ఇలాంటి ఒత్తిడి నుంచి విడుదల చేసేందుకు కంపెనీలు ఇప్పుడిప్పుడే కాస్త ఆలోచిస్తున్నాయి. ఇదిలా ఉంటే జపాన్ లోని యాహూ సంస్థ ఒక అడుగు ముందుకేసి సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు వారానికిమూడు రోజులు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే.. ఈ నిర్ణయం మరో మూడేళ్ల తర్వాత.. అంటే 2020 నుంచి అమలు చేయాలని డిసైడ్ చేసింది. తాము తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగుల్లో ప్రశాంతత పెరగటంతో పాటు.. పని మీదమరింతశ్రద్ధ పెరగటంతోపాటు.. సృజనాత్మకతతో పని చేస్తారని ఆశిస్తోంది. మరి.. జపాన్ యాహూ బాటలో మిగిలిన కంపెనీలు నడిస్తే..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/