Begin typing your search above and press return to search.
చివరి కోరిక తీరకుండానే ఉరికంబం !
By: Tupaki Desk | 23 July 2015 4:26 AM GMTనిజంగానే అన్నాడో లేక మరేదైనా కారణం ఉందో కానీ... త్వరలో ఉరికంబం ఎక్కబోయే ఒక నేరస్థుడిని... నీ చివరికోరిక ఏమిటో చెప్పాలన్నారు. వెంటనే ఆ ఖైదీ... తాను జైల్లో ఉండి చదువుకున్న చదువుకు సంబందించి పట్టా కావలన్నాడు. ఇదేమి కోరిక అని ఆశ్చర్యపోకండి... చాలా సినిమాల్లో చూస్తుంటారు కదా! ఆ ఒక్క సన్నివేశం చూసి కళ్లుమూసేసినా పర్లేదు అని... అచ్చు అలాగే అన్నమాట!
విషయం ఏమిటంటే... ఈ నెల 30న ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెయిన్ కు ఉరిశిక్ష అమలుకానుంది. అయితే 21ఏళ్లుగా జైల్లోఉన్న యాకుబ్... రెండు పీజీ కోర్సులు పూర్తిచేశాడు. ఇవి రెండూ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీనుండే చేశాడు. అయితే ఈ కోర్సులకు సంబందింఛిన ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ పొలిటికల్ సైన్స్ పరీక్షలు కూడా పాస్ అయ్యాడు... అయితే వీటికి సంబందించిన పట్టాలు కావాలని కోరిక కోరాడు! కానీ... దీనిపై స్పందించిన ఇగ్నో అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మరో వారం రోజుల్లో పట్టాలు అందించడం అసాధ్యమని తేల్చిచెప్పేశారు. దీంతో చనిపోయే లోగా ఎంఏ ఇంగ్లిష్ పట్టా తీసుకోవాలనుకున్న మెమన్ కోరిక తీరడం లేదు. ఈ చివరి కోరిక తీరకుండానే ఉరికంబం ఎక్కనున్నాడు!