Begin typing your search above and press return to search.
పుట్టిన రోజు నాడే ఉరిశిక్ష
By: Tupaki Desk | 21 July 2015 11:47 AM GMT ముంబై పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష ఖరారైంది. ఈ నెల 30న యాకూబ్ ను మహారాష్ట్ర ప్రభుత్వం ఉరి శిక్షను అమలు చేయనుంది. యాకుబ్ ఉరిశిక్షపై తీర్పు సవరణ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడంతో శిక్ష ఖరారైంది. అనేక మంది ప్రాణాలను పోట్టన పెట్టుకున్న యాకూబ్ మెమన్ ను ఉరి తియ్యడానికి సర్వం సిద్దం చేశారు. విచిత్రం ఏమిటంటే యాకూబ్ మెమన్ పుట్టిన తేదీనాడే అతనిని ఉరి తియ్యడానికి ముహుర్తం ఫిక్స్ చేశారు. తన ఉరి శిక్షను రద్దు చెయ్యాలని గత వారం యాకూబ్ మెమన్ సుప్రీం కోర్టులో క్యూరేటర్ అర్జీ సమర్పించాడు. మంగళవారం సుప్రీం కోర్టు యాకూబ్ సమర్పించిన అర్జీని కొట్టివేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం జులై 30వ తేదిన యాకూబ్ కు ఉరి శిక్ష వెయ్యాలని గత వారం నిర్ణయం తీసుకుంది. తరువాత యాకూబ్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సుప్రీం కోర్టులో అర్జీ కొట్టి వెయ్యడంతో యాకూబ్ కు ఉరి శిక్ష ఖరారు అయ్యింది.
మహారాష్ట్రలోని నాగ్ పూర్ సెంట్రల్ జైలులో జులై 30వ తేది ఉదయం 7 గంటలకు యాకూబ్ కు ఉరి శిక్ష అమలు చెయ్యనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి సైతం యూకూబ్ సమర్పించిన క్షమాభిక్ష అర్జీని తిరస్కరించిన విషయం తెలిసిందే. 1993 మార్చి 12వ తేదిన ముంబై నగరంలోని పలు రైల్వే స్టేషన్ లలో వరసు బాంబు పేలుళ్లు సంభవించి 257 మంది మరణించారు. 713 మందికి తీవ్రగాయాలైనాయి. ఈ కేసులో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్, ఇతని సోదరుడు యాకూబ్ మెమన్ ప్రధాన నిందితులు. కేసు దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు యాకూబ్ మెమన్ ను అరెస్టు చేశారు. న్యాయస్థానం యాకూబ్ కు ఉరి శిక్ష విధించింది. వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్ ఇబ్రహీంతో పాటు అతని ప్రధాన అనుచరుడు టైగర్ మెమన్ తప్పించుకున్నారు. సుప్రీం కోర్టు లో క్యూరేటివి పిటీషన్ వేయడానికి మాత్రమే ఆయనకు ఇంకా అవకాశం ఉంది.