Begin typing your search above and press return to search.

నారాయణ-యనమలకు ఇంకా భయం పోలేదట!

By:  Tupaki Desk   |   6 July 2018 6:02 AM GMT
నారాయణ-యనమలకు ఇంకా భయం పోలేదట!
X
సొంత నియోజకవర్గంలో పూర్తిగా పట్టుకోల్పోయిన టీడీపీ సీనియర్ లీడర్ - మంత్రి యనమల రామకృష్ణుడు... మరో మంత్రి - చంద్రబాబుకు రైట్ హ్యాండ్ అయిన పి.నారాయణ వచ్చే ఎన్నికల్లో కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సమాచారం. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు. వీరిద్దరి పదవీ కాలం ఇంకా ఉంది. అయితే... ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ బాగా బలంగా కనిపిస్తుండడం... గతంలో మిత్రపక్షాలుగా ఉన్న జనసేన - బీజేపీలు తమపై కత్తులు దూస్తుండడంతో కీలక నేతలు ఆయా జిల్లాల్లో ముందుండి ఎన్నికలకు వెళ్లాలన్న భావన పార్టీలో వినిపిస్తోంది. ఆ లెక్కన ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారు తమతమ సొంత జిల్లాల్లో పూర్తి బాధ్యతలను తీసుకుని టీడీపీని మళ్లీ అధికారంలోకి తేవాలన్నది ప్లాన్. కానీ.. నారాయణ - యనమలలు గత ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆ తరువాత ఎమ్మెల్సీలై మంత్రులయ్యారు. నారాయణ అయితే మంత్రి అయ్యాకే ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు వీరిద్దరు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందన్నది పార్టీలో పలువురి మాట అట. అయితే.. ఆ ప్రతిపాదనకు వీరిద్దరూ ససేమిరా అంటున్నట్లు టాక్.

ఒకప్పుడు వరుస విజయాలతో తిరుగులేని నేతగా ఉన్న యనమల ఆ తరువాత సొంత నియోజకవర్గం తునిలో పూర్తిగా పట్టు కోల్పోయారు. గత ఎన్నికలకు ముందు ఆయనకు సీన్ అర్థమై తాను పోటీ చేయకుండా సోదరుడిని బరిలో దించారు. తాను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఎమ్మెల్సీ అయిపోయారు. సోదరుడు మాత్రం ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు.

యనమల ఈసారి కూడా ఎన్నికల్లో పోటీ చేసి రిస్క్ చేయాలని అనుకోవడం లేదట. మరోవైపు నారాయణ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ పోటీ చేయలేదు. అనేక ఆరోపణలున్న ఆయన ఎన్నికల బరిలో దిగడానికి వెనుకాడుతున్నట్లు టాక్.

మరోవైపు ఎమ్మెల్సీ అర్హతతో మంత్రులైన మరో ఇద్దరు సోమిరెడ్డి - లోకేశ్ మాత్రం వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారట. సోమిరెడ్డి మొదటి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నవారే. అయితే.. ఆయన కొద్దికాలంగా వరుస ఓటములు చవిచూస్తున్నారు. ఇక లోకేశ్ ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడలేదు. అయినా... సీఎం కుమారుడు కావడంతో పార్టీ బాగా బలంగా ఉన్నచోటి నుంచి పోటీ పడడానికి సిద్ధమవతున్నట్లు సమాచారం.