Begin typing your search above and press return to search.
పీక్ స్టేజీకి చేరిన యనమల బ్యాడ్ టైం
By: Tupaki Desk | 11 Aug 2016 6:22 AM GMTతెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా మూడు దశాబ్థాలపాటు తుని అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలను ఒంటిచేత్తో శాసించిన ప్రస్తుత మంత్రి యనమల రామకృష్ణుడు 30 ఏళ్లలో తొలిసారి తిరుగుబాటు ఎదుర్కొంటున్నారు. నిన్న, మొన్నటి వరకు ఆయన వెంట తిరిగినవారే ఇపుడు మొహం చాటేస్తున్నారు. పైగా ధిక్కార స్వరం వినిపిస్తున్న పరిస్థితి. మంత్రి రామకృష్ణుడుతో పాటు ఆయన రాజకీయ వారసుడు కృష్ణుడుపై ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఇదంతా ఫార్మా కంపెనీ విషయంలో కావడం, అది టీడీపీ నాయకుడిదే కావడం ఆసక్తికరం.
టీడీపీ ఆవిర్భావం నుంచి మూడు దశాబ్థాలపాటు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకి తుని నియోజకవర్గం కంచుకోట. ఇంతకాలం రామకృష్ణుల వెన్నంటి నిలిచిన కోనబెల్ట్ గ్రామాలు ఒక్కటొక్కటిగా వారికి దూరమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడూ ఈ గ్రామాలే రామకృష్ణుడిని గట్టునపడేసేవి. నియోజకవర్గమంతా ఒక ఎత్తు అయితే ఈ గ్రామాల్లోనే ఐదారువేల మెజార్టీతో గెలిచేసేవారు. రామకృష్ణుడు ఇప్పటి వరకు అనేక పదవులు అధిష్టిస్తూ వస్తున్నారంటే పునాది ఆ గ్రామాలేనని నేతలు విశ్లేషిస్తుంటారు. ఆ నియోజకవర్గంలో 1989 నుంచి రామకృష్ణుని మాటకు 30 ఏళ్లపాటు తిరుగులేదు. కోనబెల్ట్ అంటే సుమారు 18వేల పై చిలుకు ఓటింగ్ ఉంటుంది. ఆ ఓటింగే ఆయనకు కంచుకోటగా ఉండేది. ఎన్నికల్లో ఏజంట్ కూడా లేని పరిస్థితి. అంత ఏకపక్షంగా ఓటింగ్ జరిగిపోయేది. 2005లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు (తుని మున్సిపాలిటీలో 30 వార్డుల్లో) జెడ్పీటీసీలు, ఎంపీపీలు..ఇలా దాదాపు అన్ని చోట్లా దివంగత వైఎస్ హయాంలో యనమల కోటరీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తరువాత 2009 సార్వత్రిక ఎన్నికల్లో 30 ఏళ్ల రాజకీయ ప్రస్తానంలో తొలిసారి రామకృష్ణుడు ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అశోక్‌బాబు చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచే రామకృష్ణుల రాజకీయ తిరోగమనం మొదలైంది. ఆ ఓటమితో ప్రత్యక్ష ఎన్నికలకే గుడ్‌బై చెప్పేశారు. తన రాజకీయ వారసుడిగా వరుసకు సోదరుడైన కృష్ణుడిని 2014 ఎన్నికల బరిలోకి దింపినా ఓటమే ఆహ్వానించింది. రామకృష్ణుడు కంటే రెట్టింపు ఓట్ల తేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల్లో పోటీచేసిన దాడిశెట్టి రాజా ఓడించారు.
తొండంగి మండలం దానవాయిపేట పంచాయతీలో యనమలకు నూటికి నూరుశాతం వెన్నంటి ఉండే గ్రామం తాటియాకులపాలెం. అటువంటి గ్రామమే రామకృష్ణులపై తాజాగా తిరుగుబాటు జెండా ఎగరేయడానికి వేదికగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. సుమారు 13 గ్రామాలు ఒక్కటై దివీస్ లేబొరేటరీస్‌కు భూ సేకరణ, ఇందుకు సహకరిస్తున్నారంటూ యనమల సోదరులపై తిరుగుబాటుకు నాందిపలికారు. ఆ గ్రామాల నుంచి పిల్లాపాపలతో వందలాది మంది మహిళలు తరలివచ్చి ధిక్కారస్వరాన్ని వినిపించారు. రామకృష్ణులు ఎదురుపడితే పక్కకు తప్పుకున్న ఆ గ్రామస్తులు ఒక్కటై తమ భూములు జోలికొస్తే ఖబడ్ధార్ అంటూ హెచ్చరించారంటే వారిలో ఇన్నేళ్లుగా కూడుగట్టుకున్న ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్టుగా స్పష్టమవుతోంది. తాజా వ్యతిరేకతకు భూ సేకరణ అంశం ఒకటే పైకి కన్పిపిస్తున్నా అంతర్లీనంగా రామకృష్ణుల అనుచరుల ఏకపక్ష విధానాలు కూడా తోడవుతున్నాయని అంటున్నారు. మరోవైపు ఇదే పరిస్థితి కొనసాగితే తునిలో టీడీపీ చిరునామా గల్లంతవుతుందని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.