Begin typing your search above and press return to search.
అసెంబ్లీ లో ఫొటోల గోల
By: Tupaki Desk | 8 Aug 2015 10:39 AM GMTఅసెంబ్లీలో ఫొటోల గోల ఇంకా కొనసాగుతోంది. శాసనసభ లాంజ్ లో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటో ను కొద్ది రోజుల కిందట తొలగించటం.. దానికి వైసీపీ నేత జగన్ అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ అసెంబ్లీలో ముఖ్యమంత్రుల చిత్రపటాలు పెట్టడం సంప్రదాయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సంప్రదాయానికి విరుద్ధంగా సభా ఆవరణలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటం ఉంచారన్నారు. స్పీకర్ల ఫోటోలు ఉంచాల్సిన స్థానంలో ముఖ్యమంత్రి సతీమణి చిత్రపటం ఉంచడం ఏ రకమైన సంప్రదాయమని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ వ్యవహారమంతా సభాపతి పరిధిలోనిదని, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అదే విధంగా వైఎస్ జగన్ ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు. అసెంబ్లీ లాంజ్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాన్ని యథావిధిగా ఉంచాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, స్పీకర్ కోడెల శివప్రసాద రావుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రాసిన బహిరంగ లేఖపై ఆయన ఈ విధంగా ప్రతిస్పందించారు.
అసెంబ్లీలో స్పీకర్ల చిత్రపటాలు ఉంచాల్సిన చోటు ముఖ్యమంత్రి సతీమణి ఫొటో ఉంచడం కూడా కరెక్టు కాదని యనమల చెప్పారు. జగన్ తన పద్ధతి మార్చుకోవాలని.. అన్నీ రాజకీయం చేయడం ఏమాత్రం కరెక్టు కాదని అన్నారు. మొత్తానికి ఎవరి వెర్షన్ వారు చెప్పుకొస్తున్న ఈ వివాదానికి ముగింపు పలకాల్సింది స్పీకరే.