Begin typing your search above and press return to search.
యనమల తనపై తను వేసుకున్న జోక్ ఇది
By: Tupaki Desk | 8 Oct 2018 2:19 PM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నమ్మినబంటుల్లో ఒకరు - ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి అయిన యనమల రామకృష్ణుడు తనపై తను జోక్ చేశారని అంటున్నారు. అది కూడా నేరుగా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పంచ్ పేల్చబోయి యనమల సెల్ఫ్ గోల్ చేసుకున్నారని విశ్లేషిస్తున్నారు. అందులోతమ పార్టీ నాయకుడైన సీఎం చంద్రబాబును సైతం ఇరికించేలా యనమల వ్యవహరించారని. తద్వారా నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదంతా ప్రదాని విదేశీల పర్యటన గురించి యనమల చేసిన కామెంట్ల ఫలితమే.
ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలపై అనుమానాలు వ్యక్తం చేశారు మోడీ విదేశీ ట్రిప్పులన్నీ ఫారిన్ డీల్స్ కోసమేనని ఆరోపించారు. దేశ ప్రయోజనాల కోసం విదేశాలకు వెళ్తున్నారా..? డిఫెన్స్ స్కామ్ ల కోసం విదేశాలకు వెళ్తున్నారా..? అని ప్రశ్నించిన యనమల... రాఫెల్ - కోల్ స్కామ్ - బ్యాంకుల దివాలా - ఆర్ధిక నేరస్తుల పరారీ... ఇలాంటి వాటిపై ప్రధాని ఎందుకని నోరు తెరవరని నిలదీశారు. యనమల ఇలా సూటిగా ప్రశ్నించడం వరకు బాగానే ఉన్నా...అసలు తమ సంగతి ఏంటనేది ఆలోచించుకోవాలని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇటు యనమల అటు వారి నాయకుడు నారా చంద్బరాబు నాయుడు సహా మంత్రివర్గ సహచరుల విదేశీల పర్యటనల సంగతిని విశ్లేషించుకోవాలని చెప్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు దాదాపు ముఖ్యమైన అన్ని దేశాల్లో పర్యటించడం - పెట్టుబడుల పేరుతో ఈ టూర్లకు పేరుపెట్టడం - సదరు ఖర్చులు తడిసి మోపెడవడం తెలిసిన సంగతే. అలాటి టూర్ల లెక్కలు అడిగినప్పటికీ దానికి అతీగతి లేకపోవడం విమర్శల పాలయింది. అయినా ఈ విషయాన్ని యనమల ప్రస్తావించకపోవడం చిత్రంగా ఉందంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబే కాకుండా ఆయన తనయుడైన మంత్రి లోకేష్ పెట్టుబడుల కల్పణ పేరుతో చేసిన విదేశీ టూర్లు మరో మంత్రి - బాబు కుటుంబానికి సన్నిహితుడనే పేరున్న నారాయణ - ఐటీ శాఖ మంత్రి రఘునాథరెడ్డి చేసిన విదేశీ పర్యటనలు భారీ స్థాయిలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఇక స్వయంగా యనమల విషయానికి వస్తే..ఆయన కేవలం తన దంతాలకు చికిత్స చేయించుకునేందుకు సింగపూర్ కు వెళ్లారు. అలాంటి నాయకుడు మోడీ టూర్లను ప్రశ్నిస్తున్నారని పలువురు సూటిగానే ప్రశ్నిస్తున్నారు.