Begin typing your search above and press return to search.

సాక్షిపై మాజీమంత్రి యనమల ఆగ్రహం: బ్లాక్ లిస్ట్ లో పెడతాడంట

By:  Tupaki Desk   |   17 Feb 2020 9:42 AM GMT
సాక్షిపై మాజీమంత్రి యనమల ఆగ్రహం: బ్లాక్ లిస్ట్ లో పెడతాడంట
X
అధికార వికేంద్రీకరణ బిల్లుకు శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపడంతో ఆంధ్రప్రదేశ్ లో వివాదం రాజుకుంది. ఇటీవల శాసనమండలి చైర్మన్ రెండుసార్లు పంపిన బిల్లును కార్యదర్శి తిప్పి పంపడంతో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ తీరుపై మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా తెలుగుదేశం పార్టీ నాయకులు వాటిని తిప్పి కొడుతూ రాజ్యాంగంలోని నిబంధనలు చెబుతున్నారు. అయితే వీటిలో సాక్షిలో ప్రచురితమైన కథనాలను పరిశీలించిన మాజీమంత్రులు ఆ పత్రికను బ్లాక్ లిస్టులో పెడతామని - అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అయితే ఇటీవల ఐటీ దాడులపై అవాస్తవాలు సాక్షి ప్రచురించిందని, ఆ పత్రికపై ఆధారాలతో సహా తాను త్వరలోనే ప్రెస్ కౌన్సిల్ - ఎడిటర్స్ గిల్డ్ కు ఫిర్యాదు చేస్తానని మాజీమంత్రి - టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రకటించారు. పరువు నష్టం దావా కూడా తెలిపాడు. ఈ ఐటీ దాడులతో పాటు శాసనమండలి విషయమై కూడా ఆయన మాట్లాడారు. సెలక్ట్ కమిటీ ఫైల్ ను వెనక్కి పంపడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. శాసనమండలి కార్యదర్శిపై చర్యలు తీసుకునే అవకాశం చైర్మన్ కు ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంలో కార్యదర్శిపై ప్రభుత్వం ఒత్తిడి చేయడంలో ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.

రాష్ట్రంలో జరిగే పరిస్థితులను రాష్ట్రపతి - కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ విషయమై త్వరలోనే ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీకి వెళ్తామని ప్రకటించారు. ఈ విషయమై త్వరలోనే గవర్నర్ కూడా కలిసి విన్నవిస్తామని యనమల చెప్పారు.