Begin typing your search above and press return to search.

అరే..య‌న‌మ‌ల ఇంత బాధ‌ప‌డుతున్నారే - అప్పుడేమైంది?

By:  Tupaki Desk   |   2 March 2020 3:30 PM GMT
అరే..య‌న‌మ‌ల ఇంత బాధ‌ప‌డుతున్నారే - అప్పుడేమైంది?
X
ఏపీ ఆర్థిక వ్య‌వ‌స్థ గురించి చాలా బాధ‌ప‌డుతూ ఉన్నారు మాజీ ఆర్థిక శాఖామంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు. ప్ర‌జ‌ల నుంచి గెలిచి చాలా కాలం అయిన ఈ నేత‌ను చంద్ర‌బాబు నాయుడు చాలా బాగా చూసుకుంటూ వ‌చ్చారు. అందులో భాగంగా గ‌త ఐదేళ్లూ రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను య‌న‌మ‌ల‌కు అప్ప‌గించారు. ఎమ్మెల్సీ హోదాలో య‌న‌మ‌ల ఆర్థిక శాఖామంత్రిగా కొన‌సాగారు. ఇప్పుడు కూడా ఆయ‌న ఎమ్మెల్సీగా ఉన్నారు.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మీద తీవ్రంగా విరుచుకుప‌డుతూ ఉన్నారు య‌న‌మ‌ల‌. జ‌గ‌న్ ను ప్ర‌పంచంలోని ఒక‌ప్ప‌టి నియంత‌ల‌తో పోలుస్తూ ఉన్నారు. ఒక‌వైపు భారీ స్థాయిలో పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మం హైలెట్ అవుతూ ఉన్న నేప‌థ్యంలో..య‌న‌మ‌ల ఆర్థిక మేధావిలా స్పందించారు. రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ అల్ల‌క‌ల్లోలం అయిపోతూ ఉంద‌ని, జ‌గ‌న్ మాత్రం ఇంట్లో కూర్చుని ఉన్నారంటూ య‌న‌మ‌ల విమ‌ర్శించారు. జ‌గ‌న్ ను చూస్తుంటే.. య‌న‌మ‌ల‌కు హిట్ల‌ర్, ముస్సోలినీ వంటి నియంత‌లు గుర్తుకు వ‌స్తున్నార‌ట‌! ఈ రేంజ్ లో విరుచుకుప‌డ్డారు య‌న‌మ‌ల‌.

మొత్తానికి ప‌ద‌వి నుంచి దిగిపోయాకా య‌న‌మ‌లకు రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ మీద జాలి క‌లుగుతూ ఉంది. మ‌రి ప‌ద‌విలో ఉన్న‌ప్పుడే ఏమైంది? చ‌ంద్ర‌బాబు హాయంలో ఆర్థిక వ్య‌వ‌స్థ పరిస్థితి ఏమిటి? చ‌ంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి హోదా నుంచి, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఆర్థిక మంత్రి హోదా నుంచి దిగిపోయే నాటికి రాష్ట్ర ఖ‌జానాలో ఉన్న మొత్తం ఐదు కోట్ల రూపాయ‌లు అని వారి సొంత మీడియా సంస్థ‌లే క‌థ‌నాలు ఇచ్చాయి క‌దా! ఐదేళ్ల అధికార కాలంలో య‌న‌మ‌ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఉద్ధ‌రించింది ఏమిటో ఇప్పుడు చెబితే బావుంటుంది.

అన్నింటి క‌న్నా దారుణ‌మైన అంశం.. త‌న పంటి వైద్యం కోసం సింగ‌పూర్ వ‌ర‌కూ య‌న‌మ‌ల సార్ వెళ్ల‌డం. ప్ర‌భుత్వ ఖర్చుల‌తో సింగ‌పూర్ వ‌ర‌కూ వెళ్లి త‌ప పంటిని పీకించుకొచ్చారు య‌న‌మ‌ల‌. ఇప్పుడు ఆర్థిక మేధావిలా మాట్లాడుతున్న య‌న‌మ‌ల అప్ప‌ట్లో అలా.. ప్ర‌జ‌ల సొమ్ముతో జ‌ల్సా చేశారు. తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చే స‌రికి వెన‌క్కు త‌గ్గారు. అధికారంలో ఉన్న‌ప్పుడు అడ్డంగా అలాంటి ఖ‌ర్చులు పెట్టుకుని, ఇప్పుడు ఆర్థిక వ్య‌వ‌స్థ అంటూ య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మాట్లాడ‌టం విడ్డూరం కాదా?