Begin typing your search above and press return to search.
సెంట్రల్ కేబినెట్ పై యనమల గురి..
By: Tupaki Desk | 2 Aug 2015 9:12 AM GMT తెలుగుదేశం సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మంత్రి పదవిని వీడాలనుకుంటున్నారా....? రాజ్యసభకు వెళ్లాలని కోరుకుంటున్నారా...? అంటే అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. అయితే అందుకు కారణాలేమిటన్న విషయంలో మాత్రం భిన్న వాదనలు వినినిపిస్తున్నాయి.
ఏపీ మంత్రి పదవుల్లో స్వేచ్ఛ లేదని... సీఎం జోక్యం ఎక్కువవుతుండడంతో తమకు నచ్చినట్లు నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలేదని యనమల పలువురి వద్ద అన్నట్లు సమాచారం. తన శాఖ వ్యవహాలలో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం అదికంగా ఉందని , తన శాఖ చేసిన బదిలీలను కూడా నిలిపివేశారని, దాంతో ఆయన మంత్రి పదవి కన్నా రాజ్యసభకు వెళితే బెటర్ అని బావిస్తున్నారని వినిపిస్తోంది. అయితే... ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు మరో నాలుగేళ్ల పదవీకాలం ఉంది... పైగా మంత్రి పదవిని వదులుకుని రాజ్యసభకు వెళ్తానంటున్నారంటే ఇందులో ఇంకేదో కోణం ఉందన్న వాదనా వినిపిస్తోంది. దానికి సమాధానంగా పలు కారణాలు చెబుతున్నారు. చంద్రబాబు సమర్థులుగా భావిస్తున్నవారికి కేంద్రంలో మంత్రిపదవులు ఇప్పించాలని... వారి ద్వారా రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ఇతర ప్రయోజనాలు సాధించాలని భావిస్తున్నారని సమాచారం. అయితే గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిపై నమ్మకం పెట్టుకుని ఆయన్ను కేంద్రమంత్రిని చేసినా ఆయన బీజేపీతో మంచి లైజన్ మెంటైన్ చేసిన రాష్ట్ర ప్రయోజనాలు సాధించలేకపోతున్నారని చంద్రబాబు ఇటీవల కొద్దికాలంగా ఫీలవుతున్నారట... దీంతో ఆర్థిక రంగంపై పట్టున్న ఇంకో సమర్థుడిని కూడా సెంట్రల్ కేబినెట్ కు పంపాలని ఆయన అనుకుంటున్నారని... అందులో భాగంగానే యనమలను రాజ్యసభకు పంపి.. కేంద్రంలో మంత్రిని చేయాలన్నది చంద్రబాబు వ్యూహమేనని తెలుస్తోంది. పైగా యనమల రాజ్యసభకు వెళ్తే ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీటిచ్చి వేరే సీనియర్లను ఎవరినైనా సంతృప్తి పరచొచ్చనీ ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
అయితే... ఒక్క యనమలను కదిపితే ఎన్నో సమీకరణలు మారనున్నాయి. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ అయ్యేదెవరు.. మంత్రి అయ్యేదెవరు... కేంద్రంలోనూ యనమల చేరితే ఇప్పడున్నవారిలో ఎవరి పదవైనా పోతుందా వంటి అనేక ఈక్వేషన్లు దీనితో ముడిపడి ఉన్నాయి. ఆగస్టు తరువాత దీనికి సంబంధించి చంద్రబాబు క్లారిటీకి వస్తారని తెలుస్తోంది.