Begin typing your search above and press return to search.
ఏపీ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదట
By: Tupaki Desk | 2 Sep 2016 4:51 AMఏపీ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్న విషయం తెలిసిందే. అయితే.. ఆర్థిక దుస్థితి తీవ్రత ఎంత ఉందన్న విషయంపై పలువురికి సందేహాలున్నాయ్. అవన్నీ తీరిపోయేలా తాజాగా ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు లెక్కలు చెప్పుకొచ్చారు. వృద్ధిరేటులో దూసుకెళుతున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చెబుతున్నా.. వాస్తవంలో మాత్రం లోటు రేటు మాత్రం దూసుకెళుతున్న వైనం యనమల మాటల్లో స్పష్టం కావటం గమనార్హం. పాత లెక్కల్ని పక్కన పెడితే.. కొత్తగా మొదలైన ఆర్థిక సంవత్సరంలో గడిచిన నాలుగు నెలల్లో ఏపీ సర్కారుకు వచ్చిన ఆదాయం.. పెట్టిన ఖర్చు మధ్య అంతరం భారీగా పెరిగిన విషయాన్ని వెల్లడించారు.
నాలుగు నెలల వ్యవధిలో ఆదాయం రూ.46,051 కోట్లు రాగా.. ఖర్చులు రూ.49,681 కోట్లుగా తేలింది. మొత్తంగా చూస్తే.. రూ.మూడు వేల కోట్ల మేర లోటు ఉన్నట్లు తేలింది. లోటును భర్తీ చేసేందుకు కొత్తగా పన్నులు వేసే ఆలోచన లేదన్నయనమల.. ప్రభుత్వానికి ఎదురైన లోటును కేంద్రం భర్తీ చేయాలని కోరారు. కరవు.. సచివాలయ నిర్మాణం.. అంచనాల కంటే ఎక్కువగా ఖర్చు పెడుతున్న జలవనరుల శాఖ కారణంగా ఈ లోటు ఏర్పడినట్లుగా ఆయన వివరిస్తున్నారు. ఇక.. రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరుగా ఉన్న ఎక్సైజ్ శాఖ వసూళ్లలో వృద్ధి కనిపించకపోవటం కూడా ఒక మైనస్ పాయింట్ గా చెబుతున్నారు.
మరో కీలకమైన అంశం ఏమిటంటే.. ఆదాయం భారీగా వస్తుందని అంచనా వేసిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో వృద్ధి లేని విషయాన్ని యనమల చెబుతున్నారు. ఏపీ రాజధాని పరిధిలోని కృష్ణా.. గుంటూరు జిల్లాలతో పాటు విశాఖలోనూ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయంలో ఎదుగుదల లేకపోవటం రాష్ట్ర ఆదాయం మీద ప్రభావం చూపిస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో లోటును అధిగమనించేందుకు వీలుగా.. అప్పు తెచ్చుకోవటంపైన ఏపీ ఆర్థిక మంత్రి దృష్టి పెట్టటం గమనార్హం.
లోటును భర్తీ చేసుకునేందుకు కేంద్రం నుంచి అప్పు తెచ్చుకునే వీలుంది. అయితే.. ఎఫ్ ఆర్ బీఎం చట్టం ప్రకారం ద్రవ్యలోటు మూడు శాతం వరకు మాత్రమే అప్పు పుడుతుంది. కానీ.. ఏపీలో ఇప్పుడు ద్రవ్యలోటు 3.9 శాతంగా ఉంది. నిబంధనల కారణంగా మూడుశాతం కంటే ఎక్కువగా ఉన్న మొత్తానికి అప్పు పుట్టదు. ఈ నేపథ్యంలో కేంద్రం నిబంధల్ని మారిస్తే.. మరింత అప్పు తెచ్చుకునే వీలుందని చెబుతున్నారు. అప్పులు తేవటంపైన దృష్టి పెట్టే బదులు ఆదాయం పెంచే మార్గాలపై ఏపీ ఆర్థికమంత్రి దృష్టి పెడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు ఖర్చును నియంత్రించాల్సి ఉంది. వృధా ఖర్చు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి ముందుంటారన్న పేరున్న నేపథ్యంలో.. అలాంటి వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ముఖ్యమంత్రిని తన విధానాల్ని మార్చుకోవాల్సిందిగా కోరాల్సిన అవసరం ఉంది. గతంలో చేతికి ఎముక లేనట్లుగా వైఎస్ వరాలు ఇచ్చేవారు. ఆయనిచ్చే వరాలకు తగినట్లుగా నిధుల కేటాయింపు విషయంలో నాటి ఆర్థికమంత్రి రోశయ్య తీవ్రంగా శ్రమించేవారు. ఒకదశలో వైఎస్ తీరుపట్ల రోశయ్య అభ్యంతరం వ్యక్తంచేయటం.. నిధుల విడుదలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైనాన్ని ఆయన దృష్టికి తీసుకురావాటానికి గుర్తు చేసుకోవచ్చు. రోశయ్య పుణ్యమా అని.. కొంతకాలం వరాలు ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించిన వైఎస్.. అందుకు కారణంగా రోశయ్య అన్న విషయాన్ని పలు వేదికల మీద ప్రస్తావించటం గమనార్హం. ఆదాయం పెరిగే అవకాశం లేనప్పుడు.. ఖర్చును నియంత్రించటం.. ఖర్చు చేసే మొత్తాన్ని మరింత ఫోకస్డ్ గా ఖర్చు చేసే అంశాల మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత యనమల మీద ఉంది.