Begin typing your search above and press return to search.
యనమల కొత్త థియరీ..!
By: Tupaki Desk | 10 Jun 2015 4:41 AM GMTఎక్కువ మాట్లాడితే బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగానే వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఓటుకు నోటు కేసులో రేవంత్‌తో పాటు.. చంద్రబాబు ప్రమేయం ఉందన్నట్లుగా కేసీఆర్ మాట్లాడటం.. దానికి ప్రతిగా తమ ముఖ్యమంత్రి ఫోన్లు ట్యాపింగ్ చేశారంటూ టీడీపీ నేతలు పేర్కొనటం తెలిసిందే.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో చంద్రబాబు బుక్ కావటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న వాదన చాలామంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా భారీ దెబ్బ తగలనప్పటికీ.. ఇదో ఎదురుదెబ్బ అని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు థియరీ మాత్రం దీనికి కాస్త భిన్నంగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ రాజ్యాంగ ఉల్లంఘన అని చెబుతున్న ఆయన.. కేసీఆర్ వ్యాఖ్యల్ని తనదైన శైలిలో ఎద్దేవా చేస్తున్నారు.
బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడన్న కేసీఆర్ మాటను ప్రస్తావిస్తే.. ఎవరు.. ఎవరికి రక్షిస్తారో భవిష్యత్తులో మీరే చూస్తారంటూ వ్యాఖ్యానించారు. తమ ఫోన్లను ట్యాప్ చేశారన్న అంశంపై పూర్తి విశ్వాసంతో ఉన్న యనమల.. ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్ మెడకు నేరుగా చుట్టుకోవటం ఖాయమని విశ్వసిస్తున్నట్లుగా కనిపిస్తోంది.