Begin typing your search above and press return to search.
ఇంగ్లిషులో ప్రసంగం ఏంది యనమల?
By: Tupaki Desk | 10 March 2016 3:28 PM GMTఏపీ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టే సందర్భంగా ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి బడ్జెట్ ప్రసంగంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు గంటల ఐదు నిమిషాల పాటు సాగిన ఆయన సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం మొత్తాన్ని ఇంగ్లిషులోనే మంత్రి చదవటంపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది.
తెలుగోళ్లు.. తెలుగోళ్లు అని చెప్పుకోవటం.. తెలుగును ఉద్దరించేందుకు ఏదో చేస్తున్నట్లుగా ఫోజులు కొట్టే చంద్రబాబు అండ్ కో.. బడ్జెట్ ప్రసంగాన్ని తెలుగులో కాకుండా ఇంగ్లిషులో చేయటం ఏమిటన్న సూటి ప్రశ్నను సంధిస్తున్నారు. సాటి తెలుగోడు అయి ఉండి.. యనమల చక్కగా తెలుగులో మాట్లాడకుండా ఈ ఇంగ్లిషు ప్రసంగాలు ఏంటో? అంటూ విరుచుకుపడుతున్న వాళ్లు లేకపోలేదు.
ఇదిలా ఉంటే.. ఇంగ్లిషులో సాగిన యనమల బడ్జెట్ ప్రసంగం మీద పెద్ద ఎత్తున జోకులు.. వ్యంగ్య వ్యాఖ్యలు సోషల్ మీడియా దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మరోవైపు ఈ వ్యవహారం మీద విపక్షాల వాదన మరోలా ఉంది. ప్రజలకు అర్థం కాకూడదన్న ఉద్దేశంతోనే యనమల తన బడ్జెట్ ప్రసంగాన్ని ఇంగ్లిషులో చేసినట్లుగా ఆరోపించటం గమనార్హం. అయినా.. అందరికి అర్థమయ్యేలా చక్కగా తెలుగులో చదివితే పోయే దానికి ఇంగ్లిషులో ప్రసంగించి ఇన్నేసి మాటలు అనిపించుకోవాలా? అయినా.. 80పేజీలకు పైగా ఉన్న బడ్జెట్ ప్రసంగాన్ని తెలుగులో యనమల చదవలేరా ఏంటి..?