Begin typing your search above and press return to search.
యనమలకి అధికారుల షాక్..!
By: Tupaki Desk | 29 Jun 2016 10:21 AM GMTరాజకీయాల్లో ఎవరు ఎవరికి షాక్ ఇస్తారో చెప్పడం కష్టం. అయితే, ఏపీలో ఇప్పుడు అధికారుల వంతు వచ్చింది. సాక్షాత్తు రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన విషయంలో వారు ఏకంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని ఇరికించారట! అసలు మ్యాటర్ ఏంటంటే వివాదస్పదమైన ‘స్విస్ ఛాలెంజ్’ విషయంలో యనమల నేతృత్వంలోని హైపవర్ కమిటీ తీసుకున్న నిర్ణయాలు…ముఖ్యంగా సీఎం చంద్రబాబు.. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో ఫోన్ లో మాట్లాడుకుని అన్ని విషయాలు సెటిల్ చేసుకున్నారని…అదే విషయాన్ని ఆయన మినిట్స్ లో రాయించారు.
ఈ మేరకు సీఎం చంద్రబాబుతో ఆయన ప్రతి పేజీపైనా సంతకం చేయించారు. అయితే ఆర్థిక శాఖ అధికారులు మాత్రం యనమలని ఇరికించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సింగపూర్ సంస్థలు ఇచ్చిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అయితే అందులోని కండిషన్లపై ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సింగపూర్ సంస్థలు తీసుకునే అప్పుకు సర్కారు ఎలా గ్యారంటీ ఇస్తుందని.. అభిప్రాయపడింది ఆర్థిక శాఖ.
అప్పుకు గ్యారంటీ ఇవ్వాలంటే ఎఫ్ ఆర్ బీఎం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆర్థికశాఖ పేర్కొంది. అంతే కాదు..సింగపూర్ సంస్థలు చేసే తప్పులకు కూడా సర్కారునే బాధ్యత వహించాలని కోరటం కూడా సరికాదని..దీని వల్ల ఖజానాపై పెద్ద ఎత్తున భారం పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే అప్పటికే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు హై పవర్ కమిటీతో పాటు సీఆర్ డీఏ సమావేశంలోనూ అటు ఛైర్మన్ గా..ఇటు సభ్యుడిగా సింగపూర్ సంస్థలు పెట్టిన షరతులను ఆమోదించారు. అయితే ఈ షరతులపై ఆర్థిక శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఇరుక్కుపోయినట్లు అయింది. మంత్రి వ్యక్తం చేసిన అభిప్రాయాలతో శాఖ విభేదించింది. మామూలుగా అయితే శాఖ నుంచి మంత్రికి ఫైలు పోవాలి కానీ..ఈ ఫైలు మంత్రి..ముఖ్యమంత్రి..కేబినెట్ ఆమోదం తర్వాతే ఆర్థిక శాఖకు వచ్చిందట. సో..స్విస్ ఛాలెంజ్ వ్యవహారం ఎంత కంగాళీగా మారిందో ఈ ఉదంతం చెపుతోందన్న టాక్ ఏపీ రాజకీయవర్గాల్లో ఇన్నర్ టాక్ గా చర్చ జరుగుతోంది.