Begin typing your search above and press return to search.
జగన్ తో యార్లగడ్డ!... అంతా ఇటువైపేనా?
By: Tupaki Desk | 28 Feb 2019 9:32 AM GMTప్రముఖ రచియిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్... కాసేపటి క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్ లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. యార్లగడ్డను వెంటబెట్టుకుని అక్కడ ప్రత్యక్షమైన వైసీపీ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి... ఆయనను నేరుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జగన్ లో చాలా సేపు ముచ్చటించిన యార్లగడ్డ... ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ పెంచారని చెప్పక తప్పదు.
నేటి ఉదయం ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మల్యే ఆమంచి కృష్ణమోహన్ తో పాటు దగ్గుబాటి వారసుడు హితేశ్ చెంచురామ్ - శ్రీకాకుళం మాజీ ఎంపీ కిల్లి కృపారాణిలు వైసీపీలో చేరిపోయారు. ఈ విషయాలు ముందే తెలిసినా... అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ... టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. వైసీపీ చేరేందుకు వచ్చిన ఆయనకు పార్టీ కండువా కప్పిన జగన్... వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ షాక్ నుంచి తేరుకోకముందే... అక్కడ యార్లగడ్డ ప్రత్యక్షం కావడం గమనార్హం. తెలుగు నేలలో పరిచయం అక్కర్లేని యార్లగడ్డ... రచయితగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎక్కడ ఏ కీలక కార్యక్రమం జరిగినా... అక్కడ యార్లగడ్డ ఉండి తీరాల్సిందే. ఈ క్రమంలో సరిగ్గా ఎన్నికల సమయంలో యార్లగడ్డ లోటస్ పాండ్ లో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి.
అయితే యార్లగడ్డ అక్కడికి ఎందుకు వచ్చారన్న విషయంపై పలు కోణాల్లో విశ్లేషణలు సాగుతుండగానే.. జగన్ తో భేటీని ముగించుకుని బయటకు వచ్చిన యార్లగడ్డ మీడియాతోనూ మాట్లాడారు. జగన్ తో తన భేటీ రాజకీయ ప్రాధాన్యం లేనిదేనని ఆయన ప్రకటించారు. ప్రముఖ రచయిత సి.నారాయణ రెడ్డిపై రాసిన పుస్తకాన్ని జగన్ కు అందించేందుకే తాను వచ్చానని తెలిపారు. ఈ భేటీలో రాజకీయాలపై ఎలాంటి చర్చలు జరపలేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే... జగన్ తో భేటీలో యార్లగడ్డ పలు కీలక అంశాలపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఎప్పుడూ లేనిది... సరిగ్గా ఎన్నికల సమయంలో జగన్ ఇంటిలో యార్లగడ్డ ప్రత్యక్షమయ్యారంటే... ఏదో కీలక అంశంపై చర్చించేందుకు ఆయన అక్కడికి వచ్చి ఉంటారన్న వాదన వినిపిస్తోంది.