Begin typing your search above and press return to search.
బాబుకు తెలుగు తల్లి శాపం!
By: Tupaki Desk | 15 Jun 2019 11:36 AM GMTఎన్నికల్లో చంద్రబాబు దారుణ ఓటమికి కారణాలు ఏమిటన్న ప్రశ్న వేసినంతనే ప్రతి తెలుగోడు నాన్ స్టాప్ గా రెండు.. మూడు నిమిషాలనైనా మాట్లాడే పరిస్థితి. మరింతలా తెలిసిన సబ్జెక్ట్ మీద మీరు కొత్తగా చెప్పేదేమంటారా? ఇక్కడే ఉంది అసలు పాయింట్.
బాబు ఓటమిపైన చాలామంది చాలా అంశాల్ని టచ్ చేశారు కానీ.. తాజాగా సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్ ని తెర మీదకు తెచ్చారు. బాబు ఓటమికి తెలుగు తల్లి శాపంగా వ్యాఖ్యానించి ఆశ్చర్యానికి గురి చేశారు.
బాబు సీఎంగా ఉన్నప్పుడు తెలుగు భాష అభివృద్ధి కోసం చాలానే హామీలు ఇచ్చారని.. కానీ ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. దీంతో తెలుగుతల్లికి కోపం వచ్చి.. బాబు పవర్ ను పీకేసినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. విశాఖలో ఒక కార్యక్రమానికి హాజరైన యార్లగడ్డ.. బాబు ఓటమికి కారణాలు ఏమిటో చెప్పే ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉండగా..తెలుగు విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యల్ని అభినందించారు. ఆయన గెలిచిన వెంటనే తెలుగు మీద దృష్టి పెట్టారన్నారు. స్కూళ్ల విషయంలో జగన్ అనుసరిస్తున్న తీరును ఆయన ప్రశంసించారు. ప్రతి పాఠశాలలో తెలుగును తప్పనిసరి చేస్తానని చెప్పిన తీరును ప్రశంసించారు. తెలుగు వ్యాప్తి కోసం తెలుగు విశ్వవిద్యాలయం.. తెలంగాణ అకాడమి విభజన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.