Begin typing your search above and press return to search.

యార్లగడ్డ లాంటి మేధావి నోరు జారతారా?

By:  Tupaki Desk   |   29 Dec 2019 4:50 AM GMT
యార్లగడ్డ లాంటి మేధావి నోరు జారతారా?
X
తెలుగు నేల మీద మేధావులు చాలామంది ఉన్నా.. కొందరికి వచ్చే పేరు ప్రఖ్యాతులు అన్ని ఇన్ని కావు. ఈ మేధావుల్లో సాహితీ మేధావులుగా గుర్తింపు పొందటం అంత తేలికైన విషయం కాదు. అందునా ఆంధ్రప్రదేవ్ తెలుగు భాషా సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన తెలుగు మాట్లాడే విషయంలో తప్పులు మాట్లాడటం.. ఒక పదానికి బదులుగా మరొక పదాన్ని ప్రయోగించటం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.

టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేశ్ లాంటోళ్లు తెలుగులో తప్పులు మాట్లాడితేనే ఎటకారం చేసేసే వారికి.. యార్లగడ్డ లాంటి మేధావుల నోటి నుంచి వచ్చిన మాటలకు ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాని పరిస్థితి. చాలా ముఖ్యమైన కార్యక్రమంలో అనకూడని మాటల్ని అనేసిన ఆయన తీరు చూస్తే..యార్లగడ్డ లాంటి వారికి వయసు అయిపోయిందా? అన్న సందేహం రాక మానదు.

ద్రోణంరాజు సత్యానారాయణ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ.. వర్థంతి అనాల్సింది పోయి జయంతిగా పేర్కొన్నారు. దీంతో అక్కడి వారు ఉలిక్కిపడ్డారు. ఆ వెంటనే ఆయన తప్పును సరి చేసే ప్రయత్నం చేశారు. సార్.. వర్థంతి కాదు సార్.. జయంతి అన్నా యార్లగడ్డ వారు లైట్ తీసుకున్నారు. తన లాంటి పండితుడు తప్పు మాట్లాడటమా? అనుకున్నారేమో కానీ.. అస్సలు పట్టించుకోకుండా తనదైన ఫ్లోలో వెళ్లిపోయారు. దీంతో.. అక్కడి వారంతా తల పట్టుకోవటం కనిపించింది. ఏపీ తెలుగు భాషా సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించే యార్లగడ్డ వారికి దేన్ని జయంతి అనాలి? దేన్ని వర్థంతి అనాలో తెలీకపోవటం ఏమిటి?