Begin typing your search above and press return to search.

మోడీపై మరో బీజేపీ సీనియర్‌ నేత ధ్వజం!

By:  Tupaki Desk   |   25 Jun 2015 5:37 AM GMT
మోడీపై మరో బీజేపీ సీనియర్‌ నేత ధ్వజం!
X
ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీరుపై భారతీయ జనతా పార్టీ వాళ్ల నుంచినే విమర్శలు పెరుగుతున్నాయి. పరోక్షంగా కొందరు.. డైరెక్ట్‌గా మరికొందరు మోడీని విమర్శించేస్తున్నారు. ఆయన తీరును వ్యతిరేకిస్తున్నారు. తిరుగులేని మెజారిటీతో ప్రధానమంత్రిగా ఎన్నికైన మోడీ పట్ల వీళ్లు బహిరంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఈ జాబితాలో తాజాగా స్థానం సంపాదించిన వ్యక్తి యశ్వంత్‌సిన్హా.

వాజ్‌పేయి ప్రభుత్వం లో కీలక శాఖలకు ప్రాతినిధ్యం వహించిన ఈ సీనియర్‌ కమలనాథుడికి మోడీపై కోపం వచ్చింది. మోడీ తీరును ఈయన ఖండించాడు. తమలాంటి సీనియర్లకు గౌరవం దక్కకపోవడం పట్ల నిరసన తెలిపాడు. తన మాటలతో మోడీపై మండిపడ్డాడు ఈయన.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృష్టిలో 75 సంవత్సరాల వయసు దాటిన వారంతా బ్రెయిన్‌డెడ్‌ అయిన వారితో సమానం అని యశ్వంత్‌సిన్హా వ్యాఖ్యానించాడు. ఇలాంటి వారందరికీ విలువనివ్వడాన్ని మోడీ మానేశాడని.. వారు పార్టీలో ఎంత సీనియర్లు అయినా, వారి అనుభవసారాన్ని మోడీ ఉపయోగించుకోవడం లేదని సిన్హా అన్నారు.

ఎల్‌కే అద్వానీ, శత్రుఘ్నసిన్హా, మురళీమనోహర్‌జోషి వంటి వాళ్లతో పాటు తను కూడా బ్రెయిన్‌డెడ్‌ అయిన నేతల జాబితాలోకి వస్తాను అని సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు. తన లాంటి వారి సేవలు పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ అవసరం లేదని మోడీ భావిస్తున్నాడని సిన్హా అన్నారు.

మోడీ ఇచ్చిన 'మేకిన్‌ ఇండియా' పిలుపును కూడా సిన్హా తప్పుపట్టారు. ముందుగా ఇండియాను నిర్మించాలని ఆ తర్వాత మిగతా పనులు చూడాలని సీనియర్‌ బీజేపీ నేత అభిప్రాయపడ్డాడు.