Begin typing your search above and press return to search.
దేశంలో యాత్రా రాజకీయాలు.. బాబు.. బండి నుంచి.. అఖిలేష్ బాబు వరకు!!
By: Tupaki Desk | 6 Oct 2021 11:30 PM GMTదేశంలో యాత్రా రాజకీయాలు పుంజుకున్నాయి. అధికారంలోకి రావడమే పరమావధిగా.. నాయకులు.. యాత్రలకు దిగుతు న్నారు. ప్రజలను నేరుగా కలుసుకునేందుకు, వారిలో సెంటిమెంటు రగిలించి.. సింపతీగా మార్చుకునేందుకు పెద్ద పెద్ద పార్టీల అధినేతలే.. పాదయాత్రలు, బస్సు యాత్రలు చేసిన సందర్భాలు.. ఉమ్మడి ఏపీలో మనకు కనిపించాయి. అయితే.. దేశవ్యాప్తంగా చూసుకుంటే.. పాదయాత్రలు చేయడం ద్వారా.. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన రాష్ట్రాలు రెండు మూడు ఉన్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా పేరు పొందాయి. ముందు మన ఉమ్మడిఏపీని తీసుకుంటే.. వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర కాంగ్రెస్‌కు ఆక్సిజన్‌గా మారి.. 2004లో అధికారంలోకి తీసుకువచ్చింది.
2012-13 మధ్య టీడీపీ అదినేత చంద్రబాబు చేసిన వస్తున్నా మీకోసం యాత్ర.. బాబును నవ్యాంధ్రలో అధికారంలోకి వచ్చేలా చేసింది. అదేసమయంలో 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత, ప్రస్తుత సీఎం జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర ఆయనను అధికారంలోకి తెచ్చింది. ఇక, ఇప్పుడు మరోసారి చంద్రబాబు ప్రజాయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా రెండు రోజుల కిందటే ప్రకటించారు. అయితే.. వయసు రీత్యా ఆయన పాదయాత్ర కాకుండా.. బస్సు యాత్రకు సిద్ధమవుతారనే చర్చ టీడీపీలో సాగుతోంది. టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు..
ఇదిలావుంటే, జార్ఖండ్‌లో ఏడాది కిందట అధికారంలోకి వచ్చిన జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు.. సీనియర్ నాయకుడు, మాజీ సీఎం సిబు సొరేన్ కుమారుడు.. హేమంత్ సొరేన్ కూడా పాదయాత్ర ద్వారానే అధికారం దక్కించుకున్నారు. ఇక, ఇప్పుడు అతి పెద్ద రాష్ట్రం యూపీలో(ఉత్తరప్రదేశ్)నూ.. అక్కడి ప్రధాన ప్రతిపక్షం.. సమాజ్‌వాదీ(ఎస్పీ) పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా యాత్రకు తెరదీశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేస్తున్నాయి. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఈనెల 12 నుంచి 'సమాజ్‌వాదీ విజయ్ యాత్ర' ప్రారంభించనున్నారు.
వాస్తవానికి ఆయనకు పాదయాత్రలు, బస్సు యాత్రలు కొత్తకాదు. గతంలో 2001లో 'క్రాంతి రథ యాత్ర` అనంతరం 2002లో, 2011 విముక్తి యాత్రల అనంతరం ఎస్పీ అధికారం చేపట్టడం విశేషం. ఈ నేపథ్యంలోనే మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రస్తుత 'యాత్ర' దోహదపడుతుందని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. తన రాజకీయ జీవితంలో మూడోసారి పార్టీ యాత్రను ప్రారంభించనున్నారు అఖిలేశ్. ఆయన యాత్ర చేసిన ప్రతిసారి అధికారంలోకి వచ్చిందని.. ఈసారీ అదృష్టం కలిసొస్తుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
'2011 యాత్ర తర్వాత ఎస్పీ అధికారంలోకి వచ్చింది. అఖిలేశ్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి కూడా మేము తిరిగి అధికారం చేపడతాం' అని పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి అన్నారు. అంటే.. యాత్రలతో అధికారంలోకి రావడం.. అనేది ఏపీలోనే కాదు.. యూపీలోనూ సెంటిమెంటుగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలావుంటే.. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో నూ అధికారమే పరమావధిగా.. అక్కడి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రజా సంగ్రామ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా.. దేశంలో రాను రాను నాయకుల అధికార యాత్రలు పెరుగుతుండడం గమనార్హం.