Begin typing your search above and press return to search.

ఇంకోసారి : ద‌స‌రా త‌రువాత 3 రాజ‌ధానులు !

By:  Tupaki Desk   |   25 Jun 2022 12:30 AM GMT
ఇంకోసారి : ద‌స‌రా త‌రువాత 3 రాజ‌ధానులు !
X
ద‌స‌రా త‌రువాత 3 రాజ‌ధానుల క‌ల‌కు కాస్త వాస్తవ రూపం వస్తుంద‌ట‌! ఈ మాట వైపీపీ అంటోంది. ఈ లోగా రోడ్ల ప‌నులు పూర్తి చేసేస్తార‌ట‌! ఈ రెండూ అయ్యాకే ఎన్నిక‌లు డిక్లైర్ చేసి ముందుకు వెళ్తార‌ట ! ఆహా ! ఊహలు బాగున్నాయి. వర్షాకాంలో రోడ్లేస్తారా? అద్భుతం అంటోంది ప్రతిపక్షం. ఏదేమ‌యినప్ప‌టికీ అడిగే ఛాన్స్ వచ్చినా కూడా అడ‌గ‌మ‌ని ప్రాథేయ‌ప‌డినా కూడా ప్రత్యేక హోదా గురించి అడ‌గ‌ని సీఎం జ‌గ‌న్ అని తేలిపోయింది. పోనీ హోదా విష‌యం అటుంచి రాజ‌ధాని నిర్మాణాల‌కు ఏమ‌యినా ప్ర‌త్యేక నిధులు తెచ్చారా అంటే అదీ లేదు. పోలవరం ముందుకు తీసుకెళ్తారా అంటే అదీ లేదు.

వైసీపీ ఎంపీ సాయిరెడ్డి మీడియా ముందుకు వ‌చ్చిన ప్ర‌తిసారీ అడ్మిన్ క్యాపిటల్ విశాఖే అని చెప్పి వెళ్తారు. అదేవిధంగా బొత్స లాంటి ఉత్త‌రాంధ్ర నేతలు కూడా విశాఖే పాల‌న సంబంధ రాజ‌ధాని అంటూ ఇవిగో రుజువులు అంటూ 4 మాట‌లు చెబుతారు.

కానీ బీజేపీ ప్ర‌భుత్వం రాజ‌ధాని కోసం (అమ‌రావ‌తి) నిధులు ఇస్తున్న‌ది. కానీ మౌలిక వ‌సుతుల పేరిటే వాటిని ఖ‌ర్చు చేయ‌మ‌ని చెబుతోంది. అలా చెప్పిన ప్ర‌తిసారీ మోడీ స‌ర్కారు ఇచ్చిన డబ్బులు రాజ‌ధానికే వెచ్చిస్తున్నార‌న్న గ్యారంటీ అయితే లేకుండా పోతోంది. అంటే కేంద్రం మాట‌లు పెడ చెవిన పెడుతున్నార‌నే క‌దా అనుకోవాలి.

అయినా కూడా వైసీపీకి ఓ వ్యూహం ఉంది. రాజ‌ధాని నిర్మాణాల‌కు కోర్టే అడ్డంకి అని చెప్పి త‌ప్పుకోవ‌చ్చు. ఆ విధంగా కొంత వ‌ర‌కూ స‌క్సెస్ కావొచ్చు. లేదా మోడీనే అడ్డు అని కూడా చెప్పి త‌ప్పుకోవ‌చ్చు. ఏ విధంగా చూసుకున్నా త‌ప్పు కేంద్రానిదో లేదా త‌ప్పు కోర్టుదో కావొచ్చు. కానీ త‌ప్పు జ‌గ‌న్ ది కాక‌పోవ‌చ్చు. త‌ప్పు అయినా కాక‌పోయినా ఇప్పుడున్న ఆర్థిక స్థితి గతుల్లో డ‌బ్బులు అయితే తీసుకురాలేం అని చెప్పి జ‌గ‌న్ అంటున్నారు.

ఆ విధంగా ల‌క్ష కోట్ల రాజ‌ధాని త‌న‌కు వ‌ద్ద‌ని చెప్పి వెళ్తున్నారు. ల‌క్ష కోట్లు స‌రే ఇప్ప‌టివ‌ర‌కూ వృథా చేసిన డ‌బ్బు మాటేంటి..? డ‌బ్బు వ‌ద్ద‌నుకుంటే అదేలేండి అమ‌రావ‌తి పేరిట నిధులు వ‌ద్దునుకుంటే వెన‌క్కు పంపేయాలి కదా! కానీ వాటిని తీసుకుని ఏ విధంగా ఖ‌ర్చు పెట్టి త‌రువాత త‌ప్పంతా కేంద్రానిదే లేదా కోర్టుదే అని చెబుతారు. ఏ విధంగా చూసుకున్నా రాజ‌ధాని నిర్మాణం ఇప్ప‌ట్లో తేలే తేలిక ప్ర‌క్రియ కాదు.

ఏదేమ‌యినా 3 రాజ‌ధానుల నిర్మాణానికి వైసీపీ క‌ట్టుబ‌డి ఉంది కానీ సంబంధిత నిధుల కూడిక మ‌రియు క‌ట్ట‌డే లేదు. సరే మూడు రాజధానుల్లో అమరావతి, కర్నూలు కూడా ఉన్నాయి కదా... మరి అక్కడ ఎందుకు ఏమీ కట్టడం లేదని నిలదీస్తున్నా ప్రతిపక్షాలు. ఇక బీజేపీ గ‌డియ‌కో మాట చెప్ప‌డంలో స‌క్సెస్ అవుతోంది. రాజ‌ధానుల నిర్ణ‌యం రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధి అని చెబుతూనే, బీజేపీ మ‌ద్ద‌తు మాత్రం అమ‌రావ‌తికే అని స‌న్నాయి నొక్కులు నొక్కుతోంది. చిల‌క‌ప‌లుకులు ప‌లుకుతోంది.ఇవ‌న్నీ ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ప్రత్యేక హోదా అంశాన్ని కప్పిపెట్టేయడానికి 3 రాజధానులు టాపిక్ బాగానే పనికొచ్చింది వైసీపీకి.