Begin typing your search above and press return to search.

బూతులు తిట్టడం రాజకీయం కాదు...అలీ పంచ్ ఎవరి మీద....?

By:  Tupaki Desk   |   2 Nov 2022 2:19 PM GMT
బూతులు తిట్టడం రాజకీయం కాదు...అలీ పంచ్ ఎవరి మీద....?
X
టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఆయన వైసీపీ తరఫున పనిచేస్తున్నారు. లేటెస్ట్ గా ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ పదవిని ఇచ్చారు. ఈ నేపధ్యంలో ధన్యవాదాలు తెలియచేయడానికి అలీ సీఎం ని తాడేపల్లి క్యాంప్ అఫీసులో కలిశారు. అదే సమయంలో తన కుమార్తె వివాహానికి హాజరు కావాలని అలీ సీఎం ని అహ్వానించారు.

సీఈం ని కలసివచ్చిన అనంతరం అలీ మీడియా ముందు హాట్ హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో ఉన్న వారికి చాలా ఓపిక సహనం అవసరం అని అలీ అన్నారు. బూతులు తిట్టడమే రాజకీయం కాదు అని తెలుసుకోవాలి అని అలీ పంచులేశారు. అలా అనుకుని రాజకీయం చేస్తామంటే కరెక్ట్ కానే కాదని అన్నారు. ఇక జగన్ విషయాన్ని అలీ ప్రస్థావిస్తూ ఆయన ప్రజల మనిషి అని కొనియాడారు.

ఈసారి ఏపీలో జరిగే ఎన్నికల్లో వైసీపీకి 175 కి 175 సీట్లు వస్తాయని అలీ జోస్యం చెప్పారు. సరే ఈ మాటలు ఎలా ఉన్నా అలీ చెప్పిన సుద్దులు ఎవరికీ ఆయన వేసిన పంచులు ఎవరి మీద అన్నదే ఇపుడు చర్చకు తావిస్తోంది. వర్తమాన కాలంలో బూతులు రాజకీయాల్లో మాట్లాడే నాయకులు ఎక్కువగానే ఉన్నారు. వైసీపీలో కొందరు నాయకులు కూడా బూతులు మాట్లాడుతున్నారని విపక్షాలు అంటాయి.

ఇదే సమయంలో వారిని అలీ అంటారా అంటే అది కానే కాదు, ఎందుకంటే ఆయన వైసీపీ మనిషి. జగన్ ప్రజల నేత అని చెబుతున్న అలీ ఆ విధంగా సొంత పార్టె నేతల మీద విమర్శలు చేసే చాన్సే లేదు. మరి ఎవరి మీద ఈ కామెంట్స్ అంటే ఇటీవల మంగళగిరిలో పవన్ కల్యాణ్ చెప్పుని చూపిస్తూ కొన్ని అనుచితం వ్యాఖ్యలు చేశారు. లేటెస్ట్ గా చూస్తే ఆయన విషయమే రాజకీయాల్లో చర్చగా ఉంది. అలీ కూడా పవన్ మీదనే కామెంట్స్ చేసి ఉంటారని అంటున్నారు.

పైగా రాజకీయల్లో ఉన్న వారికి ఓపిక సహనం అవసరం అని అలీ అన్న మాట కూడా ఇండైరెక్ట పవన్ మీదనేనా అన్న డౌట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇక కొసమెరుపుగా అలీ మరో మాట అన్నారు. ఇన్నాళ్ళూ చూసిన అలీ కాదు, ఇక మీదట కొత్త అలీని చూస్తారు అని. అంటే వైసీపీ ఇచ్చిన ఈ పదవితో అలీ ఏపీ రాజకీయ తెర మీద తరచుగా కనిపించడమే కాకుండా ప్రత్యర్ధులను దునుమాడతారు అన్న మాటేగా అంటున్నారు.

తనకు అప్పగించిన బాధ్యతలకు నూరు శాతం న్యాయం చేస్తాను అని కూడా అలీ చెబుతున్నారు. మొత్తానికి అలీ తొలి పంచులు విసిరారు. అది ఎవరి మీద అంటే ఎవరికి తోచిన తీరున వారు చెప్పుకుంటున్నారు. కానీ విషయం మాత్రం బహిరంగ రహస్యమే కదా.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.