Begin typing your search above and press return to search.

వైసీపీలో ఉన్న జోష్‌.. టీడీపీలో ఎక్క‌డ‌?

By:  Tupaki Desk   |   20 July 2022 11:30 PM GMT
వైసీపీలో ఉన్న జోష్‌.. టీడీపీలో ఎక్క‌డ‌?
X
ఏమాట‌కు ఆ మాటే చెప్పుకోవాలి. వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుంటుందా? లేదా? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. నిరంతరం ఇటీవ‌ల కాలంలో పార్టీలో జోష్ నింపే కార్య‌క్ర‌మాల‌కు పెద్ద‌పీట వేస్తోంది. ఇటు ప్ర‌భుత్వం ప‌రంగా, అటు పార్టీ ప‌రంగా కూడా.. జోష్ త‌గ్గ‌కుండా చూసుకుంటున్నారు. నాయ‌కుల‌ను అదిలిస్తున్నారు.. బెదిరిస్తున్నారు.. హెచ్చ‌రిస్తున్నా.. టికెట్ల‌పై కూడా దాదాపు క్లారిటీ ఇచ్చేస్తున్నారు. దీంతో నాయ‌కులు భ‌యంతోనో.. అధినేత త‌మ‌ను నిరంత‌రం గ‌మ‌నిస్తున్నార‌నే .. ఉద్దేశంతోనో.. అంతో ఇంతో క‌దులుతున్నారు.

కానీ. ఈ త‌ర‌హా వాతావ‌ర‌ణం.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంలో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ''అన్నీ చంద్ర‌బాబు చూసుకుంటున్నారులే.. ''అనే ధీమా నేత‌ల్లో పెరిగిపోయింద‌నేది వాస్త‌వం. ఆయ‌న వ‌స్తే.. పండ‌గ‌.. లేకపోతే.. దండ‌గ అన్న‌ట్టుగా పార్టీ వ్య‌వ‌హారాలు న‌డుస్తున్నాయ‌నేది వాస్త‌వం.

ఈ విష‌యంలో నాయ‌కులు ఎక్క‌డా.. ముందుకు క‌ద‌ల‌డం లేదు. ''చంద్ర‌బాబు ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నారు. మ‌నం కొంతైనా ముందుకు వెళ్దాం.. పార్టీని గెలిపించుకుందాం.'' అనే ధ్యాస చాలా చాలా త‌క్కువ మందిలోనే క‌నిపిస్తోంది. ఇది అంతిమంగా పార్టీని ముందుకు న‌డిపించ‌లేక పోతోంద‌నేది నిజం.

ఇప్ప‌టి వ‌ర‌కు చూసుకుంటే.. మ‌హానాడు త‌ర్వాత‌.. ప‌రిణామాలే దీనికి ఉదాహ‌ర‌ణ‌గా ఉన్నాయి. మినీ మ‌హానాడులు నిర్వ‌హిం చాల‌ని.. చంద్ర‌బాబు చెప్పారు. దీనికి సంబంధించి ఎవ‌రూ ముందుకు సాగ‌డం లేదు., త‌మంత‌ట తాము ముందుకు వ‌చ్చి.. ఈ కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేశామ‌ని కానీ.. ఈ కార్య‌క్ర‌మం చేస్తే బాగుంటుంద‌ని కానీ.. వారు చెప్ప‌రు. ఏదైనా కూడా చంద్ర‌బాబు నిర్దేశించాలి.. ఆయ‌న చేయాలి.. మేం వెనుక న‌డుస్తాం.. అనే ధోర‌ణిలోనే ఉన్నారు. పోనీ..చంద్ర‌బాబు అయినా.. త‌మ్ముళ్ల‌ను అదిలిస్తున్నారా? అంటే.. ఆయ‌న కూడా అలా చేయ‌డం లేదు.

ఎక్క‌డ వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని అనుకుంటున్నారో.. లేక‌.. ఇప్పుడున్న ప‌రిస్తితి చాల‌ని అనుకుంటున్నారో.. తెలియ‌దు కానీ.. నాయ‌కుల‌ను ప‌న్నెత్తు మాట అన‌డం లేదు. ర‌గ‌డ‌లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ మౌనంగానే ఉంటున్నారు. త‌మ్ముళ్ల‌ను లైన్‌లో పెట్టేందుకు ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ప్ర‌య‌త్నాలు చాల‌ని అనుకుంటున్నార‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

దీంతో టీడీపీ ముందుకు సాగ‌డం అనే మాట వినిపించ‌డం లేదు. పైగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తు అంశం కూడా పార్టీ మ‌నుగ‌డ‌పై ప్ర‌భావంపై చూపుతోంద‌నేది వాస్త‌వం. దీనిపైనా.. త‌మ్ముళ్లు ఆలోచ‌న చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఏదో ఒక విష‌యాన్ని స్ప‌ష్టంచేసి.. త‌మ్ముళ్లు పుంజుకునేలా చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు.