Begin typing your search above and press return to search.
బొబ్బిలి కోటలో రాజకీయ గడబిడ.. రీజన్ ఏంటంటే!
By: Tupaki Desk | 11 Oct 2022 1:30 AM GMTవిజయనగరం జిల్లాలోని కీలకమైన బొబ్బిలి నియోజకవర్గంలో రాజకీయ గడబిడ చోటు చేసుకుంది. ఇక్కడ మళ్లీ వైసీపీ గెలుస్తుందని.. ఆ పార్టీ కీలక నాయకుడు.. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అసవరమైతే.. తాను నోట్‌పై సంతకం కూడా చేస్తానని చెబుతున్నారు. గత నాలుగు సార్లుగా.. జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు.. కాంగ్రెస్, మరో రెండు సార్లు వైసీపీ గెలిచింది. గత ఎన్నికల్లో శంబంగి చిన అప్పలనాయుడు వైసీపీ తరఫున విజయం దక్కించుకున్నారు.
వాస్తవానికి.. ఇక్కడ బొబ్బిలి రాజులు.. సుజయకృష్ణ రంగారావు కుటుంబానికి గట్టి పట్టుంది. దీంతోనే 2014లో వైసీపీ టికెట్‌పై ఆయన విజయం దక్కించుకున్నారు. తర్వాత అనూహ్యంగా ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే 2019లో టీడీపీ టికెట్‌పై పోటీ చేశారు. అయితే.. ఆయన ఓడిపోయారు. ఇక, వచ్చే ఎన్నికల్లోనూ సుజయ్.. టీడీపీ టికెట్‌పైనే పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే మంత్రి బొత్స ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.
సుజయ్ టీడీపీలో ఉన్నా.. పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్లడం లేదు. పార్టీ వాయిస్ కూడా వినిపించడం లేదు. ఇది వైసీపీకి వరంగా మారింది. నిజానికి ఇక్కడ చిన అప్పల నాయుడు కూడా ప్రజల మధ్య లేరు. పార్టీ అధినేత , సీఎం జగన్ ఎన్ని చెప్పినా.. ఆయన కూడా ప్రజలకు చేరువ కావడం లేదు. అయితే. టీడీపీ పుంజుకునే పరిస్తితి లేక పోవడమే.. ఇక్కడ వైసీపీ మరోసారి విజయం దక్కించుకునేందుకు అవకాశం ఏర్పడుతోందన్నది విశ్లేషకుల మాట.
ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. ఈ నియోజకవర్గంపై ఇప్పటి వరకు సమీక్షించింది లేదు. కనీసం. సుజయ్‌తోనూ.. ఆయన మాట్లాడింది లేదు. మహానాడు సమయంలోనూ సుజయ్ కనిపించలేదు.
కీలక నేత.. అశోక్ గజపతిరాజుతో ఉన్న విభేదాలు అలానే కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలతోనే వైసీపీ వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కదని ఒక నిర్ణయానికి వచ్చనట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికైనా.. టీడీపీ పుంజుకుంటే.. వైసీపీని ఓడించడం పెద్ద కష్టం కాదని.. పరిశీలకులు అంటున్నారు మరి ఏం చేస్తారోచూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.