Begin typing your search above and press return to search.
లోక్ సభలో జరిగింది తెలిస్తే బాబుకు గుండెల్లో రైళ్లే!
By: Tupaki Desk | 18 Jun 2019 7:31 AM GMTఎన్నికల ఫలితాలు విడుదలై.. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో.. ఎంపీలుగా ఎన్నికైన వారంతా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమం నిన్నటి(సోమవారం) నుంచి షురూ కావటం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు పలువురు రాజ్యసభ సభ్యులు వచ్చారు. ఇదిలా ఉంటే.. ఊహించని ఒక సన్నివేశం చోటు చేసుకోవటమే కాదు.. అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది.
ఎంపీల ప్రమాణస్వీకారోత్సవాన్ని చూసేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వచ్చి కూర్చుంటే.. ఆయన ముందు సీట్లో టీడీపీ రాజ్యసభ సభ్యుడు.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సీఎం రమేశ్ ముందు వరుసలో కూర్చున్నారు. తొలుత ఇద్దరు పరస్పరం కరచాలనం చేసుకొని మాట్లాడుకొని.. ఎవరి సీట్లలో వారు కూర్చుండిపోయారు.
అనంతరం విజయసాయి రెడ్డి తన సీట్లో నుంచి లేచి.. సీఎం రమేశ్ పక్కన వచ్చి కూర్చున్నారు. ఇద్దరి మధ్య మొదలైన సంభాషణ దాదాపు గంటన్నర పాటు సాగింది. ఇద్దరు అప్యాయంగా మాట్లాడుకోవటం కనిపించింది. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. వీరి మధ్య జోరుగా మాటలు సాగుతున్న వేళ.. వీరికి దగ్గరగా వచ్చిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు దగ్గరకురాకుండా కాస్త దూరంలో కూర్చున్నారు.
అయినా.. కేవీపీని వారి ముచ్చట్లలో భాగస్వామ్యం చేయకుండా ఇరువురు మాట్లాడుకోవటం కనిపించింది. ఈ ఉదంతం ఆసక్తికరంగా మారింది. ఇద్దరి మాటలు అయ్యాక బయటకు వచ్చిన విజయసాయి రెడ్డి ని మీడియా మిత్రులు ఏం మాట్లాడుకున్నారని అడగ్గా.. విజయసాయి రెడ్డి బదులిస్తూ.. మీ హయాంలో ఏం చేశారో చెప్పమన్నా.. ఆయన చెబుతుంటే వింటున్నా అని బదులిచ్చారు. అడిగిన ప్రశ్నకు.. ఇచ్చిన సమాధానానికి పొంతన లేదన్న విషయం ఒకటైతే.. వీరిద్దరి మధ్య సాగిన ఆసక్తికర సంభాషణ బాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేయటం ఖాయమన్న మాట కొందరి నోట వినిపించింది.