Begin typing your search above and press return to search.
ఇచ్ఛాపురం దద్దరిల్లిపోయింది ? ఏమయింది బొత్సా!
By: Tupaki Desk | 6 Jun 2022 1:00 PM GMTనిన్నటి వేళ శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సోంపేట టౌన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తీవ్ర వ్యాఖ్యలు వినిపించాయి. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు అన్నది లేదని రీజనల్ కో ఆర్డినేటర్, మంత్రి బొత్స సత్య నారాయణ ఎదురుగానే చాలా మంది వాపోయారు.
మైక్ అందుకున్న వారిలో చాలా మంది తమ గోడు చెప్పుకున్నారు. దీంతో ఇది విని తట్టుకోలేకపోయిన మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి సీదిరి అప్పల్రాజు ఆగ్రహంతో ఊగిపోయారు. పార్టీలో ఉన్నవారంతా క్రమశిక్షణతో ఉండాలని ఈ ఇద్దరూ హితవు చెప్పేందుకు ప్రయత్నించి తమ ప్రసంగాలు మమ అనిపించారు. ఇంతకూ ఏమయింది.
చాలా రోజుల నుంచి ఇచ్ఛాపురంలో ఓ వర్గం పిరియా సాయిరాజు వర్గంపై కోపంగా ఉన్నారు. ఒకప్పుడు ఇంటింటికీ తిరిగి ఓట్లు రాబట్టిన కార్యకర్తలకు ఇప్పుడు మన్నన లేదు. గుర్తింపు లేదు అని వాపోతున్నారు వారంతా ! అయితే ఇదే సమయంలో ఆయన ఇంటి నుంచే జెడ్పీ చైర్మన్ గా పిరియా విజయ (ఆయన భార్య)కు ఇవ్వడంను కొందరు తట్టుకోలేకపోతున్నారు.
ఒక ఇల్లు రెండు పదవులు అన్న నియమం ఏం బాలేదని, చాలా మంది బాహాటంగానే ఎత్తిపొడుస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో యాదవ సామాజికవర్గం నుంచి ఎవరో ఒకరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న నాయకులే ఇందుకు సై అంటున్నారు.
ఇది కూడా సాయిరాజుకు మింగుడు పడడం లేదు. దాంతో మంత్రుల ఎదురుగానే జెడ్పీటీసీలు కొందరు తమ గొంతుక వినిపించారు. ఇవన్నీ రేపటి వేళ వైసీపీకి అననుకూలం కానున్నాయి. వ్యతిరేక పరిణామాల నేపథ్యంలో బొత్స క్లాస్ తీసుకున్నారు. టీడీపీలో ఉన్న ఐక్యత మనకు లేదని మండిపడ్డారు.
గత ఎన్నికల్లో ఇక్కడి టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ కేవలం 7వేల 145 ఓట్ల తేడాతోనే గెలిచారని, ఆ పాటి మెజార్టీ కూడా మెజార్టీయేనా, ఆపాటి ఓట్లు కూడా మనం తీసుకురాలేమా అని కార్యకర్తలను ప్రశ్నించి తన ప్రసంగం కొనసాగించారు. ఇదే ఇప్పుడు పెను చర్చకు తావిస్తోంది.