Begin typing your search above and press return to search.
బద్వేల్ లో వైసీపీ విజయదుందుబి .. నోటాకి '3635' ఓట్లు !
By: Tupaki Desk | 2 Nov 2021 7:01 AM GMTకడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ విజయం ఖరారైంది. 10 రౌండ్లు ముగిసేసరికి వైఎస్సార్‌సీపీ 85,505 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు అన్ని రౌండ్లలో కలిపి వైఎస్సార్‌సీపీ 1,06,088 ఓట్లు సాధించగా.. బీజేపీ 20,583, కాంగ్రెస్ 5968 ఓట్లు సాధించింది. అధికారికంగా మరో రౌండ్ ఫలితం వెలువడాల్సి వుంది. అయితే , వైసీపీ అభ్యర్థి డా.సుధ విజయం సాధించినట్టు తెలుస్తోంది. ఈ ఫలితాన్ని ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గత ఎన్నికల్లో భర్త వెంకటసుబ్బయ్యకు వచ్చిన 44,734 ఓట్ల మెజార్టీని సుధ క్రాస్ చేశారు.
ఇక ఇదిలా ఉంటే బద్వేల్ లో నోటా కి కూడా ఎక్కువగానే ఓట్లు వచ్చాయి. నోటా అంటే, ఈ అభ్యర్థులు ఎవరు మాకు నచ్చలేదు అని చెప్పడమే. దీన్ని రాజకీయ నాయకులు ఒకసారి విశ్లేషించుకోవాలి. బద్వేల్ లో ఇప్పటి వరకూ చివరి రౌండ్ ముగిసే సరికి నోటాకు 3635 ఓట్లు రావడం ఆశ్చర్యం, ఆందోళన కలిగిస్తోంది. బద్వేల్ ఉప ఎన్నికలో మొత్తం 2,15,240 ఓట్లకు గాను 1,47,213 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ పూర్తయ్యే సరికి నోటాకు మరిన్ని ఓట్లు పెరిగే అవకాశం ఉంది. 2014లో అర్ధ శాతం కంటే తక్కువగా నోటాకు 550 ఓట్లు, 2019లో ఒకటిన్నర శాతం కంటే తక్కువగా 2,004 ఓట్లు, తాజా ఉప ఎన్నికలో ఇప్పటి వరకూ ఏడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి 2,098 ఓట్లు దక్కాయి.
ఏపీలో ఇటీవల చోటు చేసుకున్న విద్వేషపూరిత, దూషణల రాజకీయాలపై ప్రజల విముఖతకు నోటాకు పడుతున్న ఓట్లే నిదర్శన మని సామాజికవేత్తలు చెబుతున్నారు. ఇది చిన్న సంఖ్యగా కనిపిస్తున్నప్పటికీ ప్రజల్లో ఇప్పుడిప్పుడే మొదలైన వ్యతిరేకతకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలపై నిరాసక్తత పెరుగుదలను నోటా ఓట్లు సూచిస్తున్నాయనేది వాస్తవం. రికార్డుస్థాయిలో నోటాకు ఓట్లు పడడాన్ని అన్ని రాజకీయ పార్టీలు సీరియస్‌గా తీసుకుని తమ తీరు మార్చుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత మెజార్టీని సైతం డాక్టర్ సుధా క్రాస్ చేయడం విశేషం.. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత.. టీడీపీ, జనసేన ఓట్లు తమకు కలిసి వస్తాయని బీజేపీ పదే పదే చెబుతూ వచ్చింది. కానీ ఎక్కడా అలాంటి పరిస్థితి కనిపించలేదు. కనీసం పోటీ ఇవ్వలేపోయాయి జాతీయ పార్టీలు రెండూ.. ఏ రౌండ్ లోనూ ఇటు బీజేపీ కానీ, అటు కాంగ్రెస్ కాని పుంజుకున్నట్టు కనిపించలేదు. ఏదో నామమాత్రపు పోటీనే కనిపిస్తోంది.బద్వేల్ లో 2021, అక్టోబర్ 30వ తేదీ శనివారం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో బద్వేల్ నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. చనిపోయిన ఫ్యామిలీకి ఈ ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంతో చనిపోయిన వారి జ్ఞాపకార్థం టీడీపీ, జనసేనలు బద్వేల్ లో పోటీ చెయ్యట్లేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు పోటీలో నిల్చున్నారు. బద్వేల్ లో అధికారపక్ష పార్టీ వైసీపీ అభ్యర్థిగా మరణించిన వెంకటసుబ్బయ్య భార్య సుధను బరిలో దింపింది.