Begin typing your search above and press return to search.
వైసీపీ కాంగ్రెస్ పొత్తు అపుడేనట....?
By: Tupaki Desk | 27 April 2022 1:30 AM GMTఏపీలో పొత్తుల రాజకీయం సాగుతోంది. పొత్తులు అన్నవి నిజానికి సూటిగా చేసే రాజకీయాలు కావు. ప్రజాస్వామ్యంలో ఓటర్లను మభ్యపెట్టడమే అవుతుంది. కానీ పొత్తులు అన్నవి జనాలతో సంబంధం లేని రాజకీయ వ్యూహాలు. ప్రజలు ఒకే సమయంలో రెండు మూడు పార్టీలను ఇష్టపడరు. అలాగే ఓటు అంటే ఒకరికే వేస్తారు. అయితే మందగా కొందరు కలసి జనాల ముందుకు వచ్చి ఓట్లు తీసుకోవడం అంటే అది కరెక్ట్ గా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించదు అని కూడా చెప్పుకోవాలి.
ఏది ఏమైనా పొత్తులు అన్నవి రాజకీయ పార్టీలకే లాభం. ఒక్కోసారి జనాలు వాటిని పట్టించుకోకపోతే కూడా వారిని నష్టమనే చెప్పాలి. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగా వైసీపీ, టీడీపీ బీజేపీ పోటీ చేశాయి. పొత్తులతో జనసేన, వామపక్షాలు ముందుకు వచ్చాయి. సింగిల్ గా వచ్చినా వైసీపీనే జనాలు ఆదరించారు. పొత్తులు లేక ఓడిపోయామని టీడీపీ భావించింది.
దాంతో ఈసారి ఆ తప్పు చేయకూడదని ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే పొత్తు మంత్రాంగం నడుపుతూ వస్తోంది. జనసేన బీజేపీ కలవడం వెనక టీడీపీ మార్క్ పాలిటిక్స్ ఉందని అంటారు. ఇపుడు పవన్ వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చమని చెప్పడంలోనూ కూటమి రాజకీయం దాగుంది. మొత్తానికి ఎలా చూసుకున్నా 2024 నాటికి బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా రావడం ఖాయం.
మరి వైసీపీ సంగతేంటి అంటే సింగిల్ గానే ఎన్నికల్లో పోటీ చేస్తామని మాజీ మంత్రి పేర్ని నాని అంటున్నారు. మాకు ఎవరితోనూ పొత్తు ఉండదు, మా విధానం మాదే అని పేర్ని నాని చెప్పేశారు. మరి కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందా అంటే అది కుదిరే వ్వవహారం కాదని ఆయన అంటూనే ఒక హింట్ మాత్రం ఇచ్చారు.
ఎన్నికల తరువాత వైసీపీ ఎంపీల మద్దతు కేంద్రంలో ఎవరికి ఇస్తామన్నది అపుడు చెబుతామని పేర్ని నాని అంటున్నారు. అంటే అన్ని ఆప్షన్లను వైసీపీ అందుబాటులో ఉంచుకుంటుంది అన్న మాట. మా ఎంపీల మద్దతు కావాల్సిన పార్టీ ఒక పని మాత్రం చేయాలి. ఏపీకి ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వారికే మా మద్దతు అని నాని కుండబద్ధలు కొట్టారు.
అది కూడా హోదా ఇస్తామని కాగితం మీద రాయాలట. అలా కనుక తమ షరతులకు అంగీకరిస్తే కాంగ్రెస్ అయినా మద్దతు ఇచ్చేందుకు అభ్యంతరం లేదు అని ఆయన చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఎన్నికల అనంతరం మాత్రమే కాంగ్రెస్ తో పొత్తుకు కానీ మద్దతుకు కానీ వైసీపీ సిద్ధపడుతుంది అని అనుకోవాలి.
అదే టైమ్ లో 2024 లో కేంద్రంలో ఎవరికీ మెజారిటీ రాదు అని వైసీపీ పెద్దలు ఊహిస్తున్నారు. దాంతో ఎవరు మ్యాజికి ఫిగర్ కి దగ్గరగా వస్తారో. ఎవరు ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉంటారో వారి వైపే మొగ్గు చూపాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి పేర్ని నాని స్టేట్మెంట్స్ అయితే బీజేపీ పెద్దలు ఉలిక్కిపడేలాగానే ఉన్నాయి. మోదీ వరసగా మూడవ సారి ప్రధాని కావాలీ అంటే వైసీపీ లాంటి పార్టీలు మద్దతు ఇవ్వాలి. మరి కాంగ్రెస్ ఎటూ హోదాను ఇచ్చి తీరుతామని అంటోంది. దాంతో ఆ కూటమి వైపు వైసీపీ మొగ్గితే మాత్రం బీజేపీ ఆశలు అడియాశలు అయినట్లే.