Begin typing your search above and press return to search.

35 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టాను.. అవి ఇస్తే.. రాజీనామా చేస్తా..వైసీపీ కౌన్సిల‌ర్‌

By:  Tupaki Desk   |   18 Feb 2022 5:48 AM GMT
35 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టాను.. అవి ఇస్తే.. రాజీనామా చేస్తా..వైసీపీ కౌన్సిల‌ర్‌
X
ఏపీ అధికార పార్టీలో నేత‌ల మ‌ధ్య అసంతృప్తులు.. ఆధిప‌త్య పోరు జోరుగా సాగుతోంది. ఎక్క‌డిక‌క్క‌డ నాయ కులు.. త‌మ హ‌వా చ‌లాయించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో సొంత పార్టీలోనే.. నేత‌ల మ‌ధ్య పోరు తార‌స్థాయికి చేరుతోంది. నిజానికి రాష్ట్ర‌స్థాయిలో జ‌రుగుతున్న‌ప్ర‌చారానికి.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ప‌రిస్థితులకు మ‌ధ్య సంబంధం లేకుండా ఉంది.

అంతేకాదు.. త‌మ‌ను వేధిస్తున్నార‌ని.. త‌మ‌ను డైల్యూట్ చేసేందుకు కొంద‌రు నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. వైసీపీలోనే నాయ‌కులు.. సొంత‌పార్టీ నేత‌ల‌పై ఆధారాల‌తో స‌హా రోడ్డెక్కుతున్నారు.

పార్టీ వ్య‌వ‌స్థాప‌క దినం నుంచి.. వైసీపీ కోసం క‌ష్ట‌ప‌డిన వారు.. పార్టీ కోసం.. ఖ‌ర్చు చేసిన వారు చాలా మం ది ఉన్నారు. ఇలాంటి వారు.. చిన్న చిన్న ప‌ద‌వుల‌ను ఆశించారు. అయితే.. కొంద‌రికి ప్రాధాన్యం ల‌భిం చ‌లేదు. ఇక‌, ప్రాధాన్యం ద‌క్కించుకున్న వారికి కూడా ఇప్పుడు సొంత పార్టీలోనే.. ఎగ‌స్పార్టీ వ్య‌క్త మ‌వుతోం ది. దీంతో క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు.. ఎదురు తిరుగుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఈ మ‌ధ్య జ‌రిగిన క్షేత్ర‌స్థాయి ఎన్నిక‌ల్లో .. హైక‌మాండ్ ఆశీస్సుల‌తో కొంద‌రు సీట్లు ద‌క్కించుకున్నారు. నిజానికి వీరికి ప్రాధాన్యం ఇవ్వ‌ద్దు.. అంటూ.. ఎమ్మెల్యేలు.. చెప్పినా..అధిష్టానం.. క్షేత్ర‌స్తాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నించి.. కొంద‌రికి అవ‌కాశం క‌ల్పించింది.

నిజానికి వైసీపీ త‌ర‌ఫున అధిష్టానం నుంచి అవ‌కాశం ద‌క్కించుకున్న‌వారిపై సొంత పార్టీ నాయ‌కులు.. క్షేత్ర‌స్థాయిలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. టీడీపీ రెబ‌ల్స్‌ను రంగంలోకి దింపారు. ఈ క్ర‌మంలో అధికార పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన వారు.. భారీగానే ఖ‌ర్చు చేశారు.

ఇప్పుడు ఇలాంటి వారు.. రోడ్డు ఎక్క‌తున్నారు. దీనికికార‌ణం.. త‌మ‌కు అధికారాలు లేకుండా చేయాల‌ని కొంద‌రు చూస్తున్నారు. దీంతో నేత‌లు.. ఆగ్ర‌హంవ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఒక కౌన్సిల్ త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట పెట్టేశారు.

తాను కౌన్సిల‌ర్ అయ్యేందుకు దాదాపు 35 ల‌క్ష‌ల‌రూపాయ‌లు ఖ‌ర్చు చేశాన‌ని.. టీడీపీ రెబ‌ల్ ఎంట్రీతో సొంత పార్టీ నాయ‌కులే త‌న‌ను ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేశార‌ని.. ఒక కౌన్సిల్ ఆరోపించారు.. ఈ నేప‌థ్యంలో అభివృద్ది చేయాల‌ని అనుకుంటే.. క‌నీసం.. ఒక వీధి లైటు కూడా మార్చే ప‌రిస్థితి త‌న‌కు లేకుండా పోయింద‌ని.. ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌తి విష‌యానికీ.. ఎమ్మెల్యే అడ్డు ప‌డుతున్నాడ‌ని.. ఆ కౌన్సిల్ చెబుతున్నారు. నిజానికి తాను ఖ‌ర్చు చేసిన‌.. 35 ల‌క్ష‌ల‌కు రూ.2 చొప్పున వ‌డ్డీ వేసుకున్నా నెల‌కు రూ.70 వేలు అయి ఉండేద‌ని.. ఆయ‌న వాపోతున్నారు.

కానీ.. త‌న‌కు మాత్రం నెల‌కు రూ.2500 మాత్ర‌మే వేత‌నం ఇస్తున్నార‌ని..దీనివ‌ల్ల త‌న‌కు ఒరిగింది ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. వార్డులో క‌నీసం.. ఒక రోడ్డు కానీ.. ఒక బోరు కానీ.. వేసే అవ‌కాశం లేకుండా పోయింద‌ని.. ఆయ‌న అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇక ఈ ప‌ద‌వి ఎందుకు.. నా డ‌బ్బులు నాకు ఇచ్చేస్తే.. రాజీనామా చేసి పోతాన‌ని ఆయ‌న చెబుతున్న‌ట్టు అధికార పార్టీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇదే విష‌యాన్ని వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.