Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ను ప్ర‌జ‌లు చీద‌రించుకుంటున్నారు: చంద్ర‌బాబు కామెంట్స్‌

By:  Tupaki Desk   |   26 Nov 2022 10:35 AM GMT
జ‌గ‌న్‌ను ప్ర‌జ‌లు చీద‌రించుకుంటున్నారు:  చంద్ర‌బాబు కామెంట్స్‌
X
ముఖ్యమంత్రి జగన్ ప్రజల్లో అసహ్యం ప్రారంభమైందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో తాడిపత్రి కౌన్సిలర్లతో సమావేశమైన చంద్రబాబు.. జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో అసహ్యం ప్రారంభమైందని.. ఆ భయంతోనే పరదాల కట్టుకుని సీఎం పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

సీఎం సభలకు బలవంతంగా ప్రజల్ని కూర్చోపెడుతున్నా.. గోడలు దూకి పారిపోతున్నారని అన్నారు. తన కర్నూలు పర్యటనతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయని.. మరో 3 జిల్లాలు తిరిగితే ఆ పార్టీ మొత్తం స‌ర్దేయ‌డం ఖాయ‌మ‌ని అన్నారు.

రాక్షసుడు సీఎం అయి ఉన్మాద పాలన సాగిస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. తాడిపత్రి డీఎస్పీ చైతన్య ప్రజా సేవకుడిగా కాకుండా ఓ డిక్టేటర్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రతీకార కాంక్షను పెంచేలా అరాచక పాలన చేస్తుండటం సమాజానికి మంచిది కాదని హెచ్చరించారు.

తాడిపత్రి కౌన్సిల్ మీటింగ్ పోలీస్ స్టేషన్లో పెట్టుకునే దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"సీఎం సభలకు ప్రజలను బలవంతంగా రప్పించినా గోడలు దూకి పారిపోతున్నారు. కర్నూలు వెళ్లి వస్తే వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. తాడిపత్రి డీఎస్పీ నియంతలా వ్యవహరిస్తున్నాడు. ప్రతీకార కాంక్షను పెంచేలా అరాచక పాలన మంచిది కాదు.

తాడిపత్రి కౌన్సిల్ మీటింగ్ పీఎస్‌లో పెట్టుకునే దుస్థితి వచ్చింది. నిబంధనలు అతిక్రమించిన పోలీసుల వివరాలు తయారు చేస్తున్నాం. అధికారంలోకి వ‌చ్చాక ఏ ఒక్క‌రినీ వ‌దిలి పెట్టం" అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.