Begin typing your search above and press return to search.
బిగ్ డిబేట్ : ఈ వ్యతిరేకత ఎవరి ఖాతాలోకి...?
By: Tupaki Desk | 19 May 2022 10:30 AM GMTవైసీపీ ఎమ్మెల్యేలు ఇపుడు గడప గడప కార్యక్రమానికి ఇంటింటికీ వెళ్తున్నారు. అయితే ఇక్కడ చిత్రమైన సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. అందరి ఎమ్మెల్యేల పట్ల జనాల వైఖరి ఒకే విధంగా లేరు. మొత్తం 151 మంది ఎమ్మెల్యేలలో మూడవ వంతు ఎమ్మెల్యేలు అయితే మూడేళ్ళుగా జనంతో ఏదో ఒక రూపేణా టచ్ లో ఉంటూ వస్తున్నారు. అలాంటి వారు మరోసారి అదే జనం వద్దకు వెళ్ళి తమ ప్రభుత్వ కార్యక్రమాలు ఇవీ అని సులువుగానే చెప్పగలుగుతున్నారు.
ఇక సమస్యలు ఏవి ఉన్నా వారి దృష్టికి ప్రజలు కూడా తీసుకువస్తున్నారు. అది అదంతా చాలా సాఫీగా సాగిపోతోంది. మరి కొందరు ఎమ్మెల్యేలు అయితే మూడేళ్ళుగా ప్రజల వద్దకు వెళ్ళిన సందర్భాలు అయితే బహు తక్కువ. అలాంటి చోట మాత్రం ఇబ్బందులు వస్తున్నాయి. చాలా మంది ఎమ్మెల్యేలు అయిన తరువాత సొంత పనుల్లో పడిపోయారు. వ్యాపారాల్లో కూడా చూసుకునే వారు ఉన్నారు.
ఈ నేపధ్యంలో వారు ఇపుడు సడెన్ గా తమ గడపకు వస్తూంటే అక్కడ జనాల రియాక్షన్ వేరేగా ఉంది. ఇంతకాలం కనిపించలేదు అన్న ఆగ్రహం కూడా వారిలో బాగా కనిపిస్తోంది. ఇక ఇంకో వైపు చూస్తే క్యాడర్ కి దూరమైన వారు కూడా గడప గడపనూ టచ్ చేయలేకపోతున్నారు. గెలిచిన తరువాత కేవలం కొందరితోనే అందుబాటులో ఉండే ప్రజా ప్రతినిధులు ఇపుడు ఏ గడప ఏదో తమకు చూపించమని క్యాడర్ ని కోరుతూంటే వారు సరిగ్గా రియాక్ట్ కావడంలేదు.
అంతే కాదు బాగా జనాలు సమస్యలతో ఉన్న చోటనే ఎమ్మెల్యేలను తీసుకువెళ్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా వైసీపీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అభాసుపాలు అవుతున్నారు అంటే దానికి వారి స్వయంకృతం కూడా ఉందని అంటున్నారు. ఇక రెండవది పార్టీని పట్టించుకోకపోవడం వల్ల కూడా సరైన సమయంలో ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నా జనాల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నా క్యాడర్ అదను చూసి సైడ్ అయిపోతోంది.
ఇంకో వైపు చూస్తే మంత్రులు. మూడేళ్ళుగా మంత్రులుగా చేసిన వారు తమ సొంత నియోజకవర్గం మీద దృష్టి సారించలేకపోయారు. దాంతో వారు ఇపుడు మాజీలుగా మారిన తరువాత వెళ్తూంటే జనాల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తోంది. పైగా వీరు అధికారంలో ఉన్నపుడు ఎన్నో కొన్ని సమస్యలు చెప్పినా ఎందుకు చేయలేదు అని కూడా నిలదీస్తున్నారు. అలా మాజీ మంత్రులలో పలువురికి ఇలాటి సంఘటనలు ఎదురయ్యాయి.
ఇక జనరల్ గా చూసుకుంటే ప్రజలలో ఒక భావన అయితే వచ్చేసింది. వైసీపీ సర్కార్ ఏలుబడిలో సంక్షేమ పధకాలు తప్ప అభివృద్ధి అన్నది లేదని, దాన్ని కొన్ని చోట్ల తమకు నిత్యం కనిపించే ఎమ్మెల్యేలకు సాఫ్ట్ గా జనాలు చెబుతూంతే అరుదుగా కనిపించే వారి మీద కోపంతో జనాలు ఇదే మాట చెబుతున్నారు. ఈ రకంగా చూసుకున్నపుడు గడప గడపకూ ప్రోగ్రాం లో ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ప్రజా ప్రతినిధులు కానీ జనాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు అనే చెప్పాలి.
అయితే ఇందులో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయకపోవడం అన్న పాయింటులో చూస్తే కచ్చితంగా అది క్యాబినేట్ దే బాధ్యత. ఆ విషయంలో ఎమ్మెల్యేలు ఏమీ చేయలేరు కూడా. ఇక వాలంటీర్ల వ్యవస్థ వచ్చాక పార్టీని సైడ్ చేయడం అన్నది పార్టీ అధినాయకత్వం చేసిన తప్పు గా కూడా చూస్తున్నారు. దీని విషయంలో కూడా లోకల్ లీడర్స్ ని తప్పుపట్టాల్సింది లేదు. అయితే తమను ఎమ్మెల్యేలుగా గెలిపించిన కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో లేని వారి విషయంలో మాత్రం వ్యతిరేకత ఏమైనా ఉంటే వారి ఖాతాలోనే ఎక్కువ వెళ్తుంది అని అంటున్నారు.
మొత్తంగా చూస్తే వైసీపీ అధినాయకత్వం ఈ టోటల్ ప్రోగ్రాం ద్వారా జనం నాడిని అయితే బాగానే పసిగట్టింది అంటున్నారు. అదే టైమ్ లో పార్టీలో గెలిచిన వారు, పనిచేసేవారు ఎవరో కూడా ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక పార్టీ క్యాడర్ ని దగ్గర తీయడం, అభివృద్ధి చేయడం అన్నవి ప్రభుత్వం, పార్టీ అధినేతల బాధ్యత. రానున్న కాలానికి వాటిని చక్కదిద్దుకోవాలని చెబుతున్నారు.
అదే టైమ్ లో ఎక్కడో ఉంటూ నియోజకవర్గాలకు చుట్టపు చూపుగా వచ్చి పోయే ప్రజా ప్రతినిధుల విషయంలో మాత్రం ఒక చాన్స్ ఇచ్చి సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు హై కమాండ్ రెడీ అవుతుంది అంటున్నారు. ఈ విధంగా గడప గడపకు వచ్చిన వ్యతిరేకతను వివిధ కేటగిరీలుగా విభజించుకుంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మాత్రం అందుబాటులో లేరు, జనాలకు బహుదూరం అన్న సమాచారం మాత్రం అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని కూడా కలవరపెడుతోంది అంటున్నారు. ఆ నంబర్ చాలా పెద్దది కావడంతో ఏ రకమైన చర్యలకు దిగుతారు అన్నదే చూడాలి.