Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురు మంత్రులను ఏం చేద్దాం.. వైసీపీ హైకమాండ్?

By:  Tupaki Desk   |   26 Sep 2020 12:30 PM GMT
ఆ ముగ్గురు మంత్రులను ఏం చేద్దాం.. వైసీపీ హైకమాండ్?
X
ఏపీ సీఎం జగన్ తెగ కష్టపడుతున్నాడు. రాజధాని కూడా లేని రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఏ లోటు లేకుండా చేస్తున్నాడు. అప్పులు తెచ్చి మరీ ప్రజలపై సంక్షేమ జల్లు కురిపిస్తున్నాడు. ఇప్పటికే 90శాతం హామీలు నెరవేర్చాడు. నవరత్నాలు అమలు చేశాడు. అయినా కూడా ఏదో చికాకు.. వైసీపీ ప్రభుత్వంపై నీలాపనిందలు.. ఎవరి వల్ల? ఎందుకొస్తున్నాయి. ఇప్పుడు అలాంటి నిందలకు ఆస్కారం లేకుండా చేయాలని వైసీపీ అధిష్టానం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

ఏపీ సీఎంకు చెడ్డపేరు తెస్తున్న ఆ ముగ్గురు మంత్రులను ఏం చేద్దాం అని పెద్ద ఎత్తున వైసీపీ హైకమాండ్ లో చర్చ చేస్తున్నారట.. ఒక మంత్రి ఏమో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తే.. ఇంకొక మంత్రి ఏమో రెడ్ హ్యాండెడ్ గా అవినీతిలో మునిగి తేలుతూ ఉన్నాడట... ఇక ఇంకొక మంత్రి ఏమో జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల దగ్గర కలెక్షన్లు చేస్తున్నాడంట.. ఎమ్మెల్యేలు డబ్బులు వసూలు చేసి ఇవ్వకపోతే నా దగ్గరికి రాకండి అని అంటున్నాడట..

ఇలా ఇంకా చాలా మంత్రుల మీద ఆరోపణలు వస్తున్నాయని.. ఇవి అన్ని సెట్ కావాలంటే ముందు చెప్పిన విధంగా కఠినంగా వ్యవహరించాలని జగన్ యోచిస్తున్నారట.. ఎవరి మీద ఆరోపణలు వస్తే వారి మంత్రి పదవులు ఖచ్చితంగా తీసివేస్తాం అని కుండబద్దలు కొట్టేలా చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారట...

అందుకే ప్రభుత్వం మీద చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే ఆ ముగ్గురు మంత్రుల మీద చర్యలు తీసుకోవాలా? లేదా అని తీవ్రంగా వైసీపీ హైకమాండ్ ఆలోచిస్తోందట... ఒకవేళ తీసివేస్తే ప్రతిపక్షాలకు అలుసు అయిపోతామా అని అధిష్టానం పెద్దలు ఇవన్నీ ఆలోచన చేస్తున్నారంట..

ఏది ఏమైనా ప్రభుత్వం మంచి సంక్షేమ పథకాలు చేస్తోందని.. ఇలాంటప్పుడు మంత్రులు కొంత అవినీతిని తగ్గించి.. జాగ్రత్తగా మాట్లాడి ప్రభుత్వాన్ని అభాసుపాలు కాకుండా చూడాలని వైసీపీ నాయకులు అంటున్నారు. చూద్దాం ఏమీ అవుతుందో..