Begin typing your search above and press return to search.

పీకే టీం హెడ్‌ని తిట్టిపోసిన వైసీపీ హైక‌మాండ్‌?

By:  Tupaki Desk   |   14 Sep 2022 3:30 PM GMT
పీకే టీం హెడ్‌ని తిట్టిపోసిన వైసీపీ హైక‌మాండ్‌?
X
అదేంటి? నిజ‌మేనా? అని అనుకుంటున్నారా? ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ ఉర‌ఫ్ పీకేతోను.. ఆయ‌న బృందంతోనూ.. వైసీపీకి ఎంతో అనుబంధం ఉందిక‌దా.. ఆ బృందాన్ని వైసీపీ అధిష్టానం నెత్తిన పెట్టుకుంటోంది క‌దా.. అలాంటిది ఇలా తిట్టిపోయ‌డం ఏంటి? అని అనుకుంటున్నారా? అయితే.. ఇది నిజ‌మే అని ప్రహకారం ఒకటి నడుస్తుంది . ఎందుకంటే.. త‌న‌కు గిట్ట‌నివారిని.. త‌నను మెచ్చ‌నివార‌ని.. త‌న‌కు అనుకూలంగా రిపోర్టులు ఇవ్వ‌ని వారిని.. పార్టీ అధిష్టానం టార్గెట్ చేస్తోంద‌నే గుస‌గుస ఎప్ప‌టి నుంచో వినిపిస్తోంది.

దీనిలో భాగంగానే ఇప్పుడే.. పీకే టీం పైనా.. వైసీపీ హైక‌మాండ్ క్లాస్ పీకింది అని అంటున్నారు . ప్ర‌స్తుతం ఈ విష‌యం వైసీపీలోనే హాట్ టాపిక్‌గా న‌డుస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కీ ఏం జ‌రిగిం దంటే.. రాష్ట్రంలో 2019లో ఏర్ప‌డిన వైసీపీ ప్ర‌భుత్వం.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా అభివృద్ధి పనులు చేప‌ట్ట లేదు. అంతేకాదు.. క‌నీసం.. రాజ‌ధాని కూడా లేకుండా చేసింద‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఉపాధి లేక నిరుద్యోగులు.. పారిశ్రామిక ప్ర‌గ‌తి లేక‌.. ఔత్సాహికులు ఇలా.. ఇబ్బంది ప‌డుతున్నార‌నేది వాస్త‌వం.

మ‌రోవైపు.. త‌మ‌కు ఎన్నిక‌ల‌కుముందు ఇచ్చిన కంట్రిబ్యూట‌రీ పింఛ‌న్ ప‌థ‌కాన్ని(సీపీఎస్‌) ర‌ద్దు చేయాల ని ఉద్యోగులు ప‌ట్టుబ‌డుతున్నా.. వారిని ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. వారు చేస్తున్న ఉద్యమాల‌పైనా వైసీపీ స‌ర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ఇక‌, ప్ర‌తి ఏటా జాబ్ క్యాలెండ‌ర్లు ఇస్తామ‌ని నిరుద్యోగుల‌కు ఇచ్చిన హామీ ఎటు పోయిందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. మ‌రోవైపు.. మూడు రాజ‌ధానుల పేరుతో.. ఉన్న రాజ‌ధాని కూడా లేకుండా చేశార‌ని.. త‌ట‌స్థ ప్ర‌జ‌లు భావిస్తున్నారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌స్తుత వైసీపీ ప్ర‌భుత్వంపై.. మూడేళ్లు తిరిగే స‌రికే ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌నేది టాక్‌. అయితే.. ఇప్ప‌టి వ‌రకు వైసీపీ మాత్రం త‌మ సంక్షేమ ప‌థ‌కాల‌తో రాష్ట్ర భారీ ఎత్తున వెలిగిపోతోంద‌ని చెబుతోంది. అప్పులు చేసి మ‌రీ సంక్షేమాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని..న‌వ‌ర‌త్నాల పేరిట రాష్ట్రంలో వెలుగులు నింపుతున్నామ‌ని చెబుతోంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175కు 175 స్థానాలు గెలుచుకుని తీరాల‌ని గొప్ప సంక‌ల్ప‌మే పెట్టుకుంది.

అయితే.. సంక‌ల్పం గ‌ట్టిదైనా.. సాధ‌న అంత తేలిక‌క‌దా! అందుకే.. పీకే టీంను రంగంలోకి దించి.. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఈ క్ర‌మంలో పీకే.. ప్ర‌స్తుతం జాతీయ రాజ‌కీయాల్లో బిజీగా ఉండ డంతో ఆయ‌న శిష్యుడు.. రిషిరాజ్‌.. ఏపీలో వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెడుతున్న విష‌యం తెలిసిందే. ఈ విష యంలో పీకే కూడా వైసీపీ హైక‌మాండ్‌కు భ‌రోసా ఇచ్చారు. ఇప్పుడు రిషిరాజ్ టీం బ‌లోపేతం అయింద‌ని చెప్పాడు. దీంతో వైసీపీ అధినాయ‌క‌త్వం.. ఏపీలో ఉన్న ప‌రిస్థితిపై నివేదిక ఇవ్వాల‌ని.. రిషిరాజ్‌ను కోరింది అని అంటున్నారు.

దీంతో రంగంలోకి దిగిన రిషిరాజ్‌.. 'వాస్త‌వ‌' ప‌రిస్థితిని గ‌మ‌నించి.. హైక‌మాండ్‌కు నివేదిక అందించార‌ట‌. ఆ నివేదిక‌లోని అంశాల‌ను చూసిన వైసీపీ అధిష్టానం.. ఒక్క‌సారిగా షాక్‌కు గురై.. పీకే టీంను చెడామ‌డా తిట్టిపోసింద‌ని.. పార్టీ వ‌ర్గాల్లోనే గుస‌గుస వినిపిస్తోంది. వాస్త‌వానికి రిషిరాజ్ వివాహానికి కూడా ఏపీ సీఎం జ‌గన్ హాజ‌ర‌య్యాడు. అయితే.. రిషిరాజ్ ఇచ్చిన రిపోర్టు మాత్రం వైసీపీ హైక‌మాండ్‌కు మంటెత్తిచ్చింద‌ని అని అంటున్నారు. దీంతో భారీగా తిట్టిపోశార‌ట‌. దీంతో అస‌లు ఈ నివేదిక‌లో ఏముందనే చ‌ర్చ సాగుతోంది.

స‌ద‌రు నివేదిక‌లో రిషిరాజ్ టీం.. ఉన్న‌ది ఉన్న‌ట్టు స్ప‌ష్టం చేసింద‌ట‌. "వ‌చ్చే రెండేళ్ల‌లో అబివృద్ధి మీద ఫోక‌స్ పెట్ట‌క‌పోతే.. మ‌న‌కు(వైసీపీ) లైఫ్ లేకుండా పోతుంది. త‌ట‌స్థంగా ఉండే ప్ర‌జ‌లు, ఉద్యోగులు, చ‌దువుకున్న వాళ్లు.. అంద‌రూ కూడా ఇప్పుడు అభివృద్ధిపై మాట్లాడుతున్నారు. అదేస‌మ‌యంలో రాజ‌ధానిపై చ‌ర్చించుకుంటున్నారు. కాబ‌ట్టి.. అభివృద్ధి మీద ఫోక‌స్ చేస్తే..నే పార్టీ బ‌తికి బ‌ట్ట‌క‌డుతుంది" అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు అని ఉందట .

దీంతో.. వైసీపీ అధిష్టానం ఒక్క‌సారిగా షాక్‌కు గురై.. పీకే టీంను చీల్చి చెండాడింద‌ని అంటున్నారు. వేల కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు ప‌ప్పుబెల్లాల్లా పంచుతుంటే.. మా పాల‌న‌కే వ్య‌తిరేక‌త ఉంద‌ని చెబుతావా? అంటూ.. నిప్పులు చెరిగింద‌ట‌ అని ప్రచారం వినిపిస్తుంది . ప్ర‌స్తుతం ఇది.. హాట్ టాపిక్‌గా మార‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.