Begin typing your search above and press return to search.

జేసీ పవన్ తో వైసీపీ హై కమాండ్ చర్చలు...?

By:  Tupaki Desk   |   1 Sep 2022 8:53 AM GMT
జేసీ పవన్ తో వైసీపీ హై కమాండ్ చర్చలు...?
X
వైసీపీ హై కమాండ్ చేయించిన సర్వేలలో అనంతపురం జిల్లాలో వైసీపీ చాలా వీక్ గా ఉందిట. రెడ్డీస్ అంతా వైసీపీ మీద గుర్రుగా ఉన్నారని అంటున్నారు. ఇక కమ్మ ప్లస్ రెడ్డీస్ టీడీపీకి పూర్తిగా వెళ్లే చాన్స్ ఉందని చెబుతున్నారు. ఇటీవల చేయించిన సర్వేలలో టోటల్ అనంతపురం జిల్లాలో రెండు సీట్లు కూడా వైసీపీకి దక్కడం కష్టమని దారుణమైన రిజల్ట్ వచ్చిందని తాడేపల్లిలో గుసగుసలు వినపడుతున్నాయి.

దీంతో కంగారు పట్టుకున్న వైసీపీ హై కమాండ్ అనంతపురం జిల్లాలో పెద్ద ఫ్యామిలీ అయిన జేసీ ఫ్యామిలీని దగ్గరకు తీయాలని చూస్తోందని టాక్. జేసీ ఫ్యామిలీ కనుక వైసీపీలోకి వస్తే అనంతపురం జిల్లాలో టోటల్ పొలిటికల్ సీన్ మారుతుంది అని వైసీపీ హై కమాండ్ భావిస్తోందిట. ఇక యువకులు అయిన జేసీ పవన్, జేసీ అస్మిత్ లకు గేలం వేస్తున్నారు అని అంటున్నారు.

ఇపుడు అనంతపురంలో ఇదే చర్చ వేడిగా వాడిగా సాగుతోంది. అయితే జేసీ ఫ్యామిలీలో పొలిటికల్ గా వెటరన్ లీడర్స్ అయిన జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిలు మాత్రం జగన్ వైపు వెళ్ళే చాన్సే లేదు అని అంటున్నారుట. దీంతో జేసీ పవన్ కూడా మేము ఏపీ చెప్పలేమని అంటున్నారుట. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో చేసిన పనులకు మాకు పార్టీలో రావాలనిపించడంలేదు అని చెబుతున్నారుట.

అందువల్ల జేసీ బ్రదర్స్ కి నాడు జగన్ సీఎం అయ్యాక ఇచ్చిన ట్రీట్మెంట్ కి ఆ ఫ్యామిలీలో యంగ్ స్టర్స్ అయిన జేసీ పవన్ అస్మిత్ మాత్రం ఈ రోజుకీ మరచిపోలేమని అంటున్నారుట. దాంతో మేము వైసీపీలోకి రాలేమనే ఖరాఖండీగా చెబుతున్నారుట. నిజానికి చూస్తే జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో జేసీల మీద పగపట్టినట్లుగా ఉక్కు పాదం మోపారు.

ఒక దశలో జేసీ ఫ్యామిలీ తగ్గినట్లుగా కనిపించింది. చంద్రబాబు మీద వారు గుస్సా కూడా అయ్యారు. జగన్ వైపు రావడానికి కూడా చూశారు. కానీ ఎందుకో వైసీపీ హై కమాండ్ మాత్రం దూకుడు చేస్తూ పోయింది. అనంతపురం జిల్లాలో ఎంతో పేరున్న జేసీ ఫ్యామిలీని బదనాం చేసింది అని అంతా అంటారు. అలాంటిది ఇపుడు అన్నీ మరచిపోయి తమ పార్టీలోకి రావాలని కోరుకోవడం వైసీపీ రాజకీయ అత్యాశగానే చూస్తున్నారు. అయితే దీని మీద మాత్రం జేసీ ఫ్యామిలీ ఒకే మాట మీద ఉంది అంటున్నారు.

జేసీ పవన్ అయినా అస్మిత్ రెడ్డి అయినా తండ్రుల మాట కాదని బయటకు వచ్చే సీన్ లేదు. సీనియర్ జేసీ బ్రదర్స్ మాత్రం తమకు జగన్ తో పడదని ఆయన రూటే సెపరేట్ అని ఏనాడో నిర్ణయానికి వచ్చేశారు. అంతే కాదు జేసీ దివాకరరెడ్డి అయితే వైఎస్సార్ తో తమకు మంచి రిలేషన్స్ ఉన్నాయి జగన్ తో ఏమీ లేవు అని ఎపుడో కుండబద్ధలు కొట్టారు. ఇక తమకు కులం కంటే కూడా ప్రాంతం రాష్ట్రం అభివృద్ధి ముఖ్యమని కూడా జేసీ బ్రదర్స్ పలు మార్లు చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే జేసీ ఫ్యామిలీ జగన్ వలలో పడే అవకాశాలు అయితే పెద్దగా లేవు అని అంటున్నారు. అయితే ఇది రాజకీయం కాబట్టి ఎపుడేమి జరుగుతుందో మాత్రం వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.