Begin typing your search above and press return to search.

హీరో నానికి వైసీపీ గట్టి కౌంటర్

By:  Tupaki Desk   |   23 Dec 2021 10:30 AM GMT
హీరో నానికి వైసీపీ గట్టి కౌంటర్
X
టాలీవుడ్ బయటపడుతోంది. యంగ్ హీరో నాని తన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ విడుదల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించడంపై నాని విమర్శలుచేసిన సంగతి తెలిసిందే..“ఇది ప్రేక్షకులను అవమానించేది కాదు. భారతదేశంలోని ఏదైనా ఉత్పత్తిపై ఎమ్మార్పీ ఉన్నప్పుడు, గరిష్ట రిటైల్ ధర లేకుండా సినిమా టిక్కెట్లను ఎందుకు విక్రయించకూడదు?’’ అని ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్ల పరిస్థితిపై హీరో నాని ఈరోజు చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.

మీడియా ముఖంగా హీరో నాని వ్యాఖ్యలపై ఏపీ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చాడు. సినిమా టికెట్ల తగ్గింపు విషయంలో ప్రజలకు మా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ప్రజల కోసమే సినిమా టికెట్లు తగ్గించామన్నారు.

ప్రభుత్వం నిర్ణయించిన టిక్కెట్ ధరలు తమ మనుగడకు సరిపోవని సినీ పరిశ్రమ భావిస్తే, ఈ ప్రకటనలన్నీ ఇవ్వడం కంటే ముఖ్యమంత్రి జగన్‌కు ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించాలని బొత్స సూచించారు.

“ప్రజాస్వామ్య దేశంలో, మీరు టికెట్ ధరగా మీకు కావలసినంత వసూలు చేయలేరు. మీరు నియమాలు.. చట్టాలను కూడా అనుసరించాలి. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలు లబ్ధి పొందుతున్నారు. సినీ పరిశ్రమకు ఏదైనా సమస్య ఉంటే మమ్మల్ని కలుసుకుని చర్చించుకోవాలి’’ అని బొత్స అన్నారు.

అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్సార్‌సీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న నిర్మాత నట్టి కుమార్, సినిమా కలెక్షన్లు.. ఈ వ్యాపారం నిర్వహించే విధానం గురించి నటుడికి ఏమీ తెలియదని హీరో నానిపై విమర్శలు కురిపించారు. "నాని మాట్లాడే ముందు ఆలోచించాలి" అన్నాడు నట్టి కుమార్.

టాలీవుడ్ హీరోలు టికెట్ రేట్లపై స్పందిస్తే దానికి కౌంటర్ పడుతుందని తెలుసు. ఈ విధమైన టార్గెట్ ఎలాగూ ఊహించబడింది.. రాబోయే రెండు రోజులు నాని ఈ విమర్శలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.