Begin typing your search above and press return to search.
ఇంత వెగటు రాజకీయాన్ని భరిస్తున్నందుకు ఆంధ్రోళ్లకు కోటి దండాలు!
By: Tupaki Desk | 26 April 2022 2:30 AM GMTఉన్నట్లుండి ఏపీ అధికారపక్ష నేతలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద గుస్సా అయిపోతున్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. సభ్యత.. సంస్కారం లాంటివి వదిలేసి మంత్రులే మాట్లాడుతున్నప్పుడు.. టుమ్రీ లాంటోళ్ల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. మొత్తానికి వెగటు రాజకీయానికి కేరాఫ్ అడ్రస్ గా మారారు వైసీపీ నేతలు. ఇంతకూ పవన్ మీద ఇంతలా గుస్సా అయిపోవటానికి.. ఎప్పుడు వల్లించే మూడు పెళ్లిళ్ల ముచ్చట మళ్లీ తెర మీదకు ఎందుకు తీసుకొచ్చారు? ఆయన మీద నోటికి వచ్చినట్లు ఎందుకు మాట్లాడుతున్నారంటే.. కారణం.. ఏపీలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు తన సొంత ఆర్థిక సాయాన్ని అందించేందుకు ముందుకు రావటమే.
ఏపీలో పెద్ద ఎత్తున కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబ పెద్దను పోగొట్టుకున్న వారి కుటుంబం వీధిన పడిన పరిస్థితి. సంక్షేమ పథకాలకు కేరాఫ్ అడ్రస్ అయిన జగన్మోహన్ రెడ్డికి ఎందుకో కాని కౌలురైతులకు సాయం చేయాలన్న ఆలోచన రాలేదు. దీనికి పెద్ద కారణాలేమీ ఉండవు. కౌలు రైతులకు సాయం చేస్తే.. వచ్చే ఓటు బ్యాంకు ఎంత? వారి కారణంగా పడే ఓట్లు ఎన్ని? గెలిచే సీట్లు ఎన్ని? లాంటి లెక్కల్లోకి వెళ్లినప్పుడు వచ్చే ఆన్సర్.. ఎలాంటి ప్రయోజనం ఉండదన్న సింఫుల్ ఆన్సర్ వచ్చేస్తుంది.
ఏం చేసినా.. ఓట్లు.. ఓటు బ్యాంకు చుట్టూ తిరగాలే కానీ.. సమస్య.. దాని తీవ్రత.. లాంటివి పట్టని వేళ.. మిగిలిన వారు ఏదైనా సాయం చేయబోతే వారిని ఏదోలా ఒక మాట అనేసి రాక్షసానందానికి గురి కావటాన్ని అలవాటుగా మార్చుకున్నోళ్లకు ఏం చెప్పగలం. ఎంతని వివరించగలం. కౌలు రైతులకు సాయం చేస్తున్న పవన్ కల్యాణ్ పై ప్రశంసల వర్షం కురుస్తూ.. సమస్యల మీద పోరాటం తప్పించి.. దిక్కుమాలిన రాజకీయం కోసం రాజకీయాలు చేయని జనసేనానిని అర్జెంట్ గా తిట్టేయాలి.
మీడియాలో ప్రముఖంగా కనిపించాలన్న ఆలోచనతో నోట్లోని నాలుకను ఇష్టారాజ్యంగా తిప్పేస్తూ.. వెగటు మాటలు మాట్లాడి.. అదే అసలుసిసలు రాజకీయం అన్నట్లుగా ఫోజులు కొట్టే వారిని ఏమనాలి? నిజమే.. ఆత్మహత్యలు చేసుకునే కౌలు రైతులకు సాయం అందించేంత తీవ్రమైన నేరానికి పాల్పడినందుకు పవన్ కల్యాణ్ లాంటి వారిని ఎందుకు క్షమించాలి? కులాలు.. మతాలు.. సామాజిక వర్గాల్ని పట్టించుకోకుండా బాధితులు ఎవరైనా సరే.. సాయం చేయటం మాత్రమే అన్నట్లుగా ముందుకు వెళ్లటం జీర్ణించుకోలేని పరిస్థితి.
మరేం తిట్టినా వర్కువుట్ కాదు. అందుకే.. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు మాదిరి మూడు పెళ్లిళ్ల ముచ్చటను తీసుకురావటం.. ఆ క్రమంలో ఇంట్లో ఉన్న మహిళల విషయంలో అయినా ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాలన్న సోయి లేకుండా.. మన ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారన్న ఇంగితం లేకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడేయటాన్ని ఏమనాలి? ఎలాంటి రాజకీయం అనాలి? సోషల్ మీడియాలో వైసీపీ వీర భక్తులు కొందరు పెట్టిన ఒకట్రెండు పోస్టులు చదివినప్పుడు.. ఎంత దరిద్రం కాకపోతే.. ఈ తరహా రాజకీయాన్ని ఆంధ్రోళ్లు భరిస్తున్నారన్న భావన కలుగక మానదు. ‘‘సన్యాసిని అవుదామనుకున్నాను. హిమాలయాలకు వెళ్దామనుకున్నాను. తీరా చూస్తే.. మూడు పెళ్లిళ్లు. ఎంత సైకో అయితే.. మొదటి ఇద్దరి పెళ్లాలు వదిలేసి ఉంటారు. మూడో ఆమె రష్యా కాబట్టి పవన్ కే పిచ్చెక్కిస్తుంది. లేకపోతే.. ఈమెను కూడా వదిలేసి ఏ ఉక్రెయిన్ దాన్నో తగులుకునేవాడు’’ అన్న ట్వీట్ ను చూస్తే.. పెట్టినోడి మైండ్ సెట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మరో ట్వీట్ లో పైత్యం మరింత ఎక్కువై.. ‘ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసింది. అత్తగారి దేశం తరఫున పవన్ యుద్ధంలో పాల్గొనవచ్చు కదా? పుతిన్ తో పరిచయం చేసుకొని తెర మీద చూపించే హీరోయిజం యుద్ధ రంగంలో చూపిస్తే రష్యా భార్య హ్యాపీ ఫీలవుద్ది. కౌలు రైతుల ఇళ్ల చుట్టూ కాదు.. యుద్ధరంగానికి వెళ్లు పవన్ కల్యాణ్’ అంటూ చేసిన ముతక ట్వీట్ చూస్తే.. వారి స్థాయి ఇట్టే అర్థమవుతుంది. పవన్ మీద ఇంత కోపం.. మాటల్లో చెప్పలేనంత ద్వేషం.. ఎందుకంటే.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు ఇంటికి వెళ్లి రూ.లక్ష సాయం ఇచ్చి రావటం. నిజమే.. జనాలు అంటే మనం విసిరేసే పదికో.. పరకకో చేతులు జాస్తూ వీధుల్లో నిలబడి ఆశగా ఎదురుచూసే స్థాయికి తెచ్చిన తర్వాత.. కష్టంలో ఉన్నోడి ఇంటికి వెళ్లి పరామర్శించి.. వారికి అండగా నిలుస్తామని చెప్పటానికి మించిన దుర్మార్గం.. దారుణం.. నేరం ఇంకేం ఉంటుంది. ఏమైనా.. ఈ సైకో రాజకీయాన్ని భరించే ఆంధ్రోళ్లు.. గోప్పోళ్లురా సామీ.