Begin typing your search above and press return to search.

అబ్బా మళ్లీనా : హోదా ఉచ్చులో జగన్

By:  Tupaki Desk   |   16 Jun 2022 3:30 PM GMT
అబ్బా మళ్లీనా : హోదా ఉచ్చులో జగన్
X
రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు సమీపిస్తున్న త‌రుణాన తెర‌పైకి మ‌ళ్లీ ప్ర‌త్యేక హోదా విష‌యం వ‌చ్చింది. దీనిపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఆ రోజు మాకు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, కేంద్రం మెడ‌లు వంచైనా స‌రే హోదా తెస్తాం అని ఎన్నిక‌ల ప్ర‌చార ప్ర‌హ‌స‌నంలో భాగంగా అప్ప‌టి విప‌క్ష నేత, ఇప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు.

వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక హోదా ఊసెత్త‌లేదు. అదేవిధంగా సీఎం ప‌ద‌వి అందుకోగానే బీజేపీకి భారీ మెజార్టీ ద‌క్కినందున తామేమీ చేయ‌లేమ‌ని, మద్ద‌తు విష‌యంలో త‌మ అవ‌స‌ర‌మేమీ లేద‌ని, ఒంటరిగానే బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకోగ‌లింద‌ని, అలాంట‌ప్పుడు తాము చెప్పినా మాట నెగ్గ‌దు అని ఆ రోజు సీఎం సింపుల్ గా తేల్చేశారు.

త‌రువాత కాలంలో హోదా పోరు పూర్తిగా ముగిసిన అధ్యాయం అయిపోయింది. సీఎం జగ‌న్ కూడా వీలున్నంత వ‌ర‌కూ ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌కుండా జాగ్రత్త‌ప‌డుతున్నార‌ని, త‌ద్వారా ప్ర‌జా వ్య‌తిరేక‌త నుంచి త‌ప్పించుకుంటున్నార‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి.

అయితే ఈ విష‌యంలో తెలుగుదేశం పార్టీ కాస్తో,కూస్తో మాట్లాడ‌గ‌లిగింది. జన‌సేన కూడా కాస్తో కూడా కాస్తో,కూస్తో మాట్లాడ‌గ‌లిగింది. అవ‌న్నీ నేరు ఫ‌లితాలు ఇవ్వ‌క‌పోయినా ప్రధాన పార్టీలు అధికారం లేక‌పోయినా మాకెందుకులే అని నిస్స‌హాయ‌త‌లోకి వెళ్లిపోకుండా మాట్లాడేయి అన్న వాద‌న కూడా ఉంది. ఇందుకు త‌గ్గ ఆధారాలు పార్ల‌మెంట్ వీడియో ఫైల్స్ లో న‌మోదు అయి ఉన్నాయి.

కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు (శ్రీ‌కాకుళం ఎంపీ) కూడా వీలున్నంత వ‌ర‌కూ విభ‌జ‌న చ‌ట్టం అమ‌లు చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. ఆఖ‌రికి తెలంగాణ లీడ‌ర్లు కూడా ఆంధ్రాకు మ‌ద్ద‌తుగానే ఉన్నారు. కానీ వైసీపీ మాత్రం ఆ విష‌యం మ‌రిచిపోయింద‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది. తాజాగా మళ్లీ ప్రత్యేక హోదా విషయం ప్రధాన వార్తయి కూర్చుంది.

రాష్ట్ర ప‌తి ఎన్నిక‌లకు సంబంధించి ఎన్గీఏ అభ్య‌ర్థి నెగ్గాలంటే వైసీపీ మ‌ద్ద‌తు త‌ప్ప‌ని స‌రి. కానీ ఎటువంటి కండీష‌న్స్ పెట్ట‌కుండానే, హోదాకు సంబంధించి మాట మాత్రంగా అయినా ప్ర‌స్తావించ‌కుండానే సీఎం జ‌గ‌న్ త‌న త‌ర‌ఫు మ‌ద్ద‌తును మోడీ వ‌ర్గాల‌కు అందించేందుకు సిద్ధం అవుతున్నార‌ని తెలుస్తోంది. కీల‌క స‌మ‌యాల్లో కూడా జ‌గ‌న్ ఈ విధంగా వ్య‌వ‌హ‌రించ‌డంపై విమ‌ర్శ‌లున్నా ప్ర‌స్తుతానికి అవి అధికార పార్టీ ప‌రిగ‌ణ‌న‌లో లేవ‌ని తెలుస్తోంది. ఓ విధంగా ఎవ‌రో అన్న విధంగా హోదా అన్న‌ది ముగిసిన అధ్యాయ‌మే కావొచ్చు. రేప‌టి వేళ ఇదే విష‌య‌మై మ‌రోమారు తెలుగు ప్రాంత నాయ‌కులు మాట్లాడ‌గ‌లిగితే మేలు. ఆ పాటి ఆశ మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మిగిలే ఉంది.