Begin typing your search above and press return to search.
పసుపు కుంకుమ మేనిఫెస్టోలో ఉందా చంద్రబాబు: వైసీపీ వర్గాలు?
By: Tupaki Desk | 6 Aug 2020 4:30 PM GMTజగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చింది. దాదాపు 90శాతం పూర్తి చేసింది. అయితే హామీ ఇవ్వని పథకాలను కూడా ప్రవేశపెట్టి అమలు చేసింది. ప్రజల అంచనాలకు మించి అందజేసింది. ఆ కోవలోనే హామీ ఇవ్వని ‘మూడు రాజధానులు’ కూడా చేస్తోంది. పాలన వికేంద్రీకరణ.. ప్రజలకు పాలనను చేరువ చేయడం.. మళ్లీ విభజన వాదం రాకుండా వైసీపీ సర్కార్ అడుగులు వేస్తోంది. అయితే మేనిఫెస్టో లేని మూడు రాజధానుల అమలుపై ప్రతిపక్ష టీడీపీ అధినేత కారాలు మిరియాలు నూరుతున్నారు.
గత రెండు రోజులు నుంచి నవరత్నాలులో రాజధాని వికేంద్రీకరణ లేదు అని చంద్రబాబు ఊదరగొడుతుంటే వైసీపీ వర్గాలు బాగానే కౌంటర్ ఇస్తున్నాయి. ‘అయ్యా చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో పసుపు కుంకుమ ద్వారా మహిళలకు, పేదవాళ్లకు ఇస్తా అని ఎప్పుడు ప్రకటించలేదు కదా’ అని వైసీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
ఎన్నికలకు మూడు రోజుల ముందు ప్రభుత్వ డబ్బుతో ‘పసుపు కుంకుమ’ కానుక కింద ఎలా ఇచ్చావ్ అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ప్రజలకు ఏ ప్రభుత్వం ఇచ్చినా సంతోషమేనని.. మేనిఫెస్టోలో పెట్టాల్సిన అవసరం లేదు అని సూచిస్తున్నారు. ఆ విధంగానే మూడు రాజధానులు పెడితే రాష్ట్రం బాగు పడుతుందని మేము చేస్తున్నామని చెబుతున్నారు. దీనికి మేనిఫెస్టో అవసరం లేదు అని వైసీపీ వర్గాలు గట్టి కౌంటర్ ఇస్తున్నాయి.
ఇలా చంద్రబాబు చేస్తే అది సంసారం.. వేరే పార్టీ చేస్తే వ్యభిచారమా అని వైసీపీ వర్గాలు కౌంటర్ ఇస్తున్నాయి.ఇప్పటికే ప్రజలకు మేలు చేసే నిర్ణయాలను స్వాగతించాలని కోరుతున్నాయి.