Begin typing your search above and press return to search.

జూనియర్ ఎన్టీయార్ ని తొక్కేస్తున్నారు...సడెన్ గా వేడి పుట్టించిన కొడాలి

By:  Tupaki Desk   |   9 Dec 2022 12:59 PM GMT
జూనియర్ ఎన్టీయార్ ని తొక్కేస్తున్నారు...సడెన్ గా వేడి పుట్టించిన కొడాలి
X
ఆయన మాట్లాడితే అంతే. మాటలే బాంబులుగా వచ్చి పడతాయి. అవి సూటిగా టీడీపీకే గుచ్చుకుంటారు. ఆ పార్టీ అధినాయకుడు. మూలపురుషుడు చంద్రబాబుకే నా బాణాలు అంటూ కొడాలి శపధం పట్టి మరీ వరసగా వేస్తూనే ఉంటారు. ఎన్టీయార్ ని దేవుడిగా కొలిచే మాజీ మంత్రి కొడాలి నానికి టీడీపీలో చంద్రబాబు అంటే మా చెడ్డ అయిష్టం. ఆయన పేరు చెబితే శివాలెత్తిపోతారు.

అలాంటి కొడాలి నాని మరోసారి నోరు చేసుకున్నారు.ఈసారి ఎన్టీయార్ వంశం, ఆయన డీ ఎన్ ఏ లేకుండా కుట్ర చేస్తున్నారు అని కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. కేవలం లోకేష్ కోసమే ఇదంతా చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. ఆనాడు టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీయార్ నుంచి ఈ రోజు జూనియార్ దాకా ఎవరినీ టీడీపీలో లేకుండా చేశారంటూ బాబు మీదనే కొడాలి విరుచుకుపడ్డారు.

పార్టీని స్థాపించిన సీనియర్ ఎన్టీయార్ డీ ఎన్ ఏ ను పక్కన పెట్టి నారా లోకేష్ ని అందలం ఎక్కించడానికి బాబు చూస్తున్న తీరుని ఆయన పూర్తిగా తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీయార్ ది నందమూరి వంశీకులది అని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. కానీ బైపాస్ చేస్తూ మధ్యలో లోకేష్ ని తెస్తూ జూనియర్ ఎన్టీయార్ ని లేకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

అంతే కాదు నాని మరో సంచలన కామెంట్ చేశారు. బలమైన కులం ఏపీని ఆక్రమిస్తోంది అని ఆయన ఆరోపించారు. ఆ కులం కమ్మ కులం అని ఆయన చెప్పకనే చెప్పేశారు. ఏపీలో జగన్ అత్యంత శక్తిమంతుడైన నాయకుడు అని కొడాలి ఆయన మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ప్రజల్కు పిలుపు ఇచ్చారు. ఒక ఎన్టీయార్ ఒక వైఎస్సార్ కలిస్తే జగన్ అవుతారు అంటూ ఆయన బలం శక్తి ఏంటో నాని చెప్పుకొచ్చారు.

తనకు మంత్రి పదవి దక్కకపోవడం పట్ల కూడా నాని చిత్రమైన కామెంట్స్ చేశారు. తనకు పదవి లేకపోయినా ఫరవాలేదని, ఎందుకంటే జోగి రమేష్ కి మంత్రి పదవి దక్కింది అంటే అది తనకు, వల్లభనేని వంశీకి పేర్ని నానికి ఇలా తమ ముగ్గురుకీ పదవి వచ్చినట్లే అని ఆయన కొత్త లెక్క చెప్పుకొచ్చారు.

మొత్తానికి చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న కొడాలి నాని ఉన్నట్లుండి ఇపుడు ఈ రకంగా కామెంట్స్ చేయడం, జూనియర్ ఎన్టీయార్ ని మధ్యలోకి తీసుకురావడం తన సొంత కులం కమ్మలను కూడా విమర్శిస్తూ వారు ఏపీని ఆక్రమిస్తున్నారు అని చెప్పడం ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలే అంటున్నారు.

జగన్ని కాపాడుకోవాలి అని కొడాలి నాని పిలుపు ఇవ్వడం వెనక మరోసారి ఆయన్ని సీఎం గా చేయాలని విన్నపం ఉందని అంటున్నారు. ఇక నాని చెప్పిన ఈ విషయాలను చూస్తూంటే ఏపీలో టీడీపీ గ్రాఫ్ ఏమైనా పెరిగినట్లుగా నానికి సంకేతాలు వచ్చాయా అన్న చర్చ కూడా వస్తోంది. ఏది ఏమైనా నాని చంద్రబాబుని ఊరకే టార్గెట్ చేయరని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.