Begin typing your search above and press return to search.

నాని టైమ్స్ : ఒంట‌రి వార‌య్యారా.. ! ఓడిపోయారా.. !

By:  Tupaki Desk   |   18 April 2022 3:28 AM GMT
నాని టైమ్స్ : ఒంట‌రి వార‌య్యారా.. ! ఓడిపోయారా.. !
X
ప‌వ‌న్ అయినా క్ష‌మిస్తారు కానీ జ‌గ‌న్ మాత్రం క్ష‌మించ‌రు అని తేలిపోయింది. ఓ విధంగా ప్ర‌భుత్వం ప‌రువు తీసిన బాప‌తు మ‌నుషులు ఇవాళ చాలా మంది ఉన్నా కూడా పాపం కొంద‌రికే శిక్ష ప‌డింది. ఆ విధంగా ఇవాళ కొంద‌రు త‌మ‌ని తాము తెలుసుకునే ప్ర‌య‌త్నంలో ఉంటే, ఇంకొంద‌రు మాత్రం ఇళ్ల‌కే పరిమితం అయి గ‌త కాల స‌మీక్ష‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు.

అంటే వీళ్లంతా ఇప్ప‌టికిప్పుడు మారిపోతారు అని అనుకోకూడ‌దు కానీ మారిపోయేందుకు ఉన్న అవకాశాల‌ను మాత్రం ప‌రిశీలిస్తున్నారు అని మాత్రం చెప్ప‌డంలో త‌ప్పు లేదు. అతి కూడా లేదు.

ఆ విధంగా కొడాలి నాని ఇవాళ ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఆ రోజు ఆయ‌న నోటికి వ‌చ్చిన విధంగా చంద్ర‌బాబును తిట్టారు. లోకేశ్ ను తిట్టారు. కొన్ని సార్లు ప‌వ‌న్ ను కూడా తిట్టారు. ఇది వ‌ర‌కు తిడితే అంద‌లం కానీ ఇప్పుడు తిడితే అధికార పార్టీనే తిరిగి తిట్ట‌లేక ప‌ద‌వి నుంచి త‌ప్పించి హాయిగా ఇంటికే ప‌రిమితం చేసిన దాఖ‌లాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని టీడీపీ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ప‌ద‌వులు పోయిన వారంతా ఏం చేస్తున్నారని? ఓ విధంగా మ‌ళ్లీ పోరాటం చేస్తాను మ‌ళ్లీ మా బూతుల మంత్రులంతా వ‌స్తారు అని ఒక్క అనిల్ కుమార్ యాద‌వ్ అనే మాజీ మంత్రి (ఒక‌ప్ప‌టి జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి ) వ్యాఖ్యానించ‌డం మిన‌హా మిగ‌తావాళ్లెవ్వ‌రూ కాన్ఫిడెంట్ గా లేరు.

విచిత్రం ఏంటంటే ఆయ‌న కూడా ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాలు ఎక్క‌డ త‌న‌పై మాటల దాడి చేస్తాయో అన్న ముందు జాగ్ర‌త్త‌లో భాగంగానే మాట్లాడుతున్నారు. వాస్త‌వానికి ప‌ద‌వులు పోయిన మంత్రుల‌ను ఉద్దేశించి టీడీపీ కానీ జ‌న‌సేన కానీ పెద్ద‌గా స్పందించ‌ద‌లేదు. పైగా ఈ వివ‌రంను లేదా విష‌యం ను వైసీపీ ఇంట‌ర్న‌ల్ ఇష్యూగానే చూసింది. అయిన‌ప్ప‌టికీ అనిల్ మాత్రం ప‌వ‌న్ ను టార్గెట్ చేశారు మ‌ళ్లీ ! అవ‌న్నీ రాస్తే మ‌ళ్లీ రాద్ధాంతాలే త‌ప్ప కొత్త‌గా ఒన‌గూరే ప్ర‌యోజ‌నాలు ఏమీ లేవు.

ఇక ఇదే స‌మ‌యంలో కొడాలి నాని కూడా ఎందుక‌నో పెద్ద‌గా మాట్లాడ‌క‌పోయినా ప‌ద‌వి నుంచి దిగిపోయే ముందు మాత్రం మునుప‌టి దూకుడు మ‌ళ్లీ ఉంటుంద‌ని, విశ్వ రూపం చూపిస్తాన‌ని మాత్రం మీడియాతో అన్నారు. కానీ ఎండ‌లు క‌దా అని త‌గ్గి ఉన్నారా ఆయ‌న అని టీడీపీ విమ‌ర్శ‌లు చేస్తోంది. ఇదే సమ‌యాన మ‌రో మంత్రి పేర్ని నాని కూడా త‌గ్గిపోయారు. అంటే ప‌ద‌వులు పోయిన వారంద‌రిపై కూడా విప‌క్షాల‌కు సాఫ్ట్ కార్న‌ర్ ఉంది.

సింప‌తీ ఉంది అని తేలిపోయింది అని ప‌రిశీల‌కులు అంటున్నారు. ప‌ద‌వి పోయిన వారిని క‌న్నా రేపో మాపో జ‌నాగ్ర‌హం కార‌ణంగా మ‌ళ్లీ ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యేందుకు సిద్ధంగా ఉన్న వారిని టార్గెట్ చేయ‌డం ఇంకా బెట‌ర్ అన్న వాద‌న కూడా పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ నుంచి వ‌స్తోంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఓట‌మి బాగుంటుంది.. గెలుపు క‌న్నా! అన్న సూత్రం ఒక‌టి జీవితానుభవం అయితే మేలు ఇప్ప‌టి మాజీ మంత్రుల‌కు అలానే ఇంకొంద‌రికి కూడా!