Begin typing your search above and press return to search.
కోనసీమ కల్లోలం వెనుక వైసీపీ నేత : జనసేన ఫైర్
By: Tupaki Desk | 25 May 2022 9:30 AM GMTకోనసీమ జిల్లా పేరు మార్పుపై స్థానికంగా చెలరేగిన అలజడి.. విధ్వంసం, మంత్రి, ఎమ్మెల్యే నివాసాలకు నిప్పు వంటి ఘటనల వెనుక.. జనసేన నాయకులు ఉన్నారంటూ.. వైసీపీ నాయకులు.. మంత్రి తానేటి వనిత చేసిన విమర్శలకు.. జనసేన బలమైన కౌంటర్ ఇచ్చింది.
తమకు, తమ పార్టీకి.. ఈ కల్లోలానికి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు.. అసలు.. కోనసీమ కల్లోలంవెనుక.. అమలాపురం పట్టణానికి చెందిన అన్యం సాయి అనే వ్యక్తి ఉన్నాడని.. జనసేన నేతలు ఆరోపించారు.
అన్యం సాయి అనే యువకుడికి.. వైసీపీ నేతలతో రాజకీయ సంబంధాలు ఉన్నాయని.. ఆయన వైసీపీ మద్దతు దారుడని.. జనసేన నేతలు పేర్కొన్నారు. సుదీర్ఘ కాలంగా.. వైసీపీలో పనిచేస్తున్నారని కూడా జనసేన నేతలు తెలిపారు.
విజయసాయిరెడ్డి, సజ్జల రామ కృష్నారెడ్డి వంటి కీలక నేతలతోనూ అన్యం సాయికి సంబంధాలుఉన్నాయని .. పేర్కొన్నారు. వీటికి సంబంధించిన.. కొన్ని ఫొటోలను కూడా జనసేన పార్టీ విభాగం.. సోషల్ మీడియాకు విడుదల చేసింది.
అంతేకాదు.. అసలు కోనసీమ అలజడి వెనుక.. వైసీపీ రాజకీయ వ్యూహకర్త.. ప్రశాంత్ కిశోర్ ఉన్నాడని జనసేన నాయకులు ఆరోపించారు. ప్రశాంత్ కిశోర్.. పక్కా ప్లాన్ ప్రకారమే.. కోనసీమపై అలజడి సృష్టించా రని.. ప్రశాంతమైన పచ్చటి ప్రాంతంలో నిప్పులు చెలరేగేలా చేశారని.. జనసేన నాయకులు మండిప డ్డారు. ఇక, ఈ దాడుల్లో జనసేన నాయకులు ఉన్నారని చెప్పడాన్ని.. మంత్రి తానేటి వనిత చేసిన వ్యాఖ్యలను విమర్శలను కూడా ఖండిస్తున్నట్టు చెప్పారు.
కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ..కొన్నాళ్లుగా జరిగిన ఉద్యమంలో అన్యం సాయి.. అనే యువకుడు ప్రధాన పాత్ర పోషించాడనికూడా జనసేన నేతలు తెలిపారు. ఇటీవల కలెక్టరేట్ ముట్టడి విషయంలో.. ఇతనే.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు. ఈ విషయంలో జనసేనను అనవసరంగా లాగొద్దని.. అధికార పపార్టీ నాయకులకు , మంత్రులకు జనసేన నాయకులు విజ్ఞప్తి చేశారు.